వృద్ధుల కోసం 'మ్యాజికల్' స్టిక్.. దీని స్మార్ట్ ఫీచర్లను చూశారంటే ఔరా అనాల్సిందే..

by Disha Web Desk 20 |
వృద్ధుల కోసం మ్యాజికల్ స్టిక్.. దీని స్మార్ట్ ఫీచర్లను చూశారంటే ఔరా అనాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : చాలా ఇండ్లలో అమ్మమ, తాతయ్య, నానమ్మలు ఉంటూనే ఉంటారు. ప్రస్తుతం మనం గడుపుతున్న బిజీ లైఫ్ లో వారిని చూసుకోలేక పోతున్నాం. అయితే ఇంట్లోని పెద్దవారు తమ ఖాళీ సమయాన్ని గడపేందుకు తరచుగా పార్క్, రోడ్డు పక్కన టీ దుకాణం వద్ద వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొన్ని సార్లు కుటుంబ సభ్యులకు కూడా తెలియని కొన్ని ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. గంటలు గడిచినా వారు మన తిరిగి రాకపోతే భయపడి వెతకడం ప్రారంభిస్తాము. అలాంటప్పుడు వారు ఎక్కడున్నారో తెలుసుకోవడం కూడా కష్టమే.

అందుకే ఇంట్లోని పెద్ధవారు ఎక్కడికి వెలుతున్నారో కనిపెట్టే ఒక మంత్రదండం గురించిన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా తాతామామ్మలు ఎక్కడ ఉన్నారో సులభంగా ట్రాక్ చేయగలుగుతారు. అలాగే వారు కిందపడి గాయపడినట్లయితే ఆ సమాచారాన్ని కూడా పొందుతారు.

కెన్ గో సృష్టించిన హ్యాండ్ స్టిక్..

అమెరికన్ కంపెనీ కెన్ గో GPS, కాలింగ్ ఫీచర్‌తో కూడిన స్టిక్‌ను రూపొందించింది. దీనిలో వృద్దులు ఒక బటన్‌ను నొక్కి కాల్స్ చేయవచ్చు. ఈ వాకింగ్ స్టిక్ ప్రత్యేకంగా వృద్ధుల కోసం రూపొందించారు. ఈ కర్ర నడకలో వృద్ధులకు సహాయం చేయడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కూడా వారికి సహాయం చేస్తుంది.

వృద్ధులు పడిపోతే కుటుంబ సభ్యులకు సందేశం..

వాస్తవానికి ఈ స్టిక్ వినియోగదారుల రోజువారీ కార్యకలాపాల పై నిఘా ఉంచుతుంది. ఈ స్టిక్ రోగుల ఆరోగ్య వివరాలను వారి కుటుంబ సభ్యులకు, వైద్యులకు కూడా పంపుతూనే ఉంది. వినియోగదారులు ఈ స్టిక్ లోని బటన్‌ను నొక్కడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో కూడా కాల్‌లు చేయవచ్చు. అంతే కాదు వినియోగదారులు నడిచేటప్పుడు పడిపోయినట్లయితే, సంబంధిత కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందుతుంది.

ఈ కర్రకు స్ర్కీన్ కూడా ఉంటుంది. ఈ స్క్రీన్‌ పై వినియోగదారుకు ఎవరి కాల్ వస్తోందో తెలుస్తుంది. ఇది ప్రతి నెల, వారం వినియోగదారుల ఆరోగ్యానికి సంబంధించిన డేటాను వారి కుటుంబ సభ్యులతో పంచుకుంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 48 గంటల పాటు ఉంటుంది. ప్రస్తుతం దీని ధర దాదాపు రూ.33 వేలు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed