ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మరో టెక్ దిగ్గజం.. 15శాతం ఉద్యోగాల తొలగింపు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-15 16:52:43  IST  )

మరో టెక్ దిగ్గజం అమెజాన్ తమ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్ఆర్ విభాగంలో దాదాపు 15శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ పై భారీగా పెట్టుబ‌డులు పెడుతున్న నేప‌థ్యంలో ఖ‌ర్చులు త‌గ్గించుకునేందుకు

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మరో టెక్ దిగ్గజం.. 15శాతం ఉద్యోగాల తొలగింపు
X

దిశ‌, వెబ్ డెస్క్: మరో టెక్ దిగ్గజం అమెజాన్ తమ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్ఆర్ విభాగంలో దాదాపు 15శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ పై భారీగా పెట్టుబ‌డులు పెడుతున్న నేప‌థ్యంలో ఖ‌ర్చులు త‌గ్గించుకునేందుకు అమెజాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అమెజాన్ లో హెచ్ఆర్ విభాగాన్ని పీపుల్ ఎక్స్‌పీరియన్స్ టెక్నాలజీ గ్రూప్ అని పిలుస్తారు. ఈ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 10వేల మందికి పైగా పనిచేస్తున్నారు.

తొలగింపులతో వారిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. హెచ్ఆర్‌తో పాటు ఇతర వినియోగదారుల వ్యాపార విభాగాల్లోని ఉద్యోగాల్లో సైతం కోత విధించే అవకాశం ఉన్నట్టు సంస్థ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉద్యోగాల కోతపై అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్‌ను మీడియా ప్రశ్నించగా ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. ఇదిలా ఉంటే ఏఐ కారణంగా అమెజాన్ సహా పలు కంపెనీల్లో గత కొంతకాలంగా ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. దీంతో టెక్ దిగ్గజ కంపెనీల్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Hyundai Motor India: దేశంలో హ్యుండాయ్ భారీ పెట్టుబడులు.. ఐదేళ్లలో రూ. 45 వేల కోట్లు

Next Story