ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల దించివేత

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-17 03:39:45  IST  )

ఎయిరిండియా (Air India) విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటన కోల్‌కతా (Kolkata) సుభాష్ చంద్రబోస్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల దించివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా (Air India) విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటన కోల్‌కతా (Kolkata) సుభాష్ చంద్రబోస్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco) నుంచి వయా కోల్‌కాతా ముంబై (Mumbai)కి వెళ్తుండగా.. ఎయిరిండియా ఫ్లైట్ నెం AI180, బోయింగ్-200 LRలో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. సోమవారం అర్ధరాత్రి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి 12.45కు కోల్‌కతా‌లోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఆ విమానం రాత్రి 2 గంటలకు ముంబైకు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఫ్లైట్ ఎడమ వైపు ఇంజిన్‌లో టెక్నికల్ సమస్యను పైలెట్లు గుర్తించారు. అనంతరం ప్రయాణాన్ని వాయిదా వేసి.. ఉదయం 5.20 సమయంలో ప్యాసింజర్లను విమానం నుంచి దిగిపోవాలని ప్రకటించారు. ప్రయాణ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫ్లైట్ కెప్టెన్ పేర్కొన్నారు.

Next Story