రానా సినిమా విడుదల ఆగిపోయింది..

by  |
రానా సినిమా విడుదల ఆగిపోయింది..
X

దిశ, సినిమా : రానా దగ్గుబాటి ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘అరణ్య’. తమిళ్‌లో ‘కాదన్’, హిందీలో ‘హాథీ మేరి సాథీ’గా తెరకెక్కిన సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. కాగా ‘అరణ్య’, ‘కాదన్‌’ ముందుగా అనౌన్స్ చేసిన తేదీకే విడుదల చేస్తున్నా.. హిందీ వెర్షన్ రిలీజ్ మాత్రం ఆగిపోయినట్లు ప్రకటించారు మేకర్స్.

హిందీ మార్కెట్‌లో కొవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది సినిమా నిర్మాణ సంస్థ ఇరోస్ ఇంటర్నేషనల్. కాస్త సమయం తీసుకుని మళ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని వెల్లడించింది. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో విష్ణు విశాల్, పుల్కిత్ సామ్రాట్, శ్రియా పిల్గొంకర్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.

Next Story

Most Viewed