నయావాల్.. చతేశ్వర్ పూజారా కల నెరవేరేనా?

by  |
నయావాల్.. చతేశ్వర్ పూజారా కల నెరవేరేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పూజారా.. గత ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో రికార్డుల మోత మోగించాడు. భారత క్రికెట్ ప్రధాన వాల్ రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత నుంచి జాతీయజట్టుకు వన్‌డౌన్‌లో అసమాన సేవలు అందిస్తున్నాడు. 32 సంవత్సరాల వయసుకే 81 టెస్టు మ్యాచ్‌లు భారత క్రికెటర్లలో మేటిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. 2010 క్రికెట్ సీజన్లో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా తన తొలిటెస్ట్ మ్యాచ్ ఆడిన పూజారా నాటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. 2010 నుంచి, 2021 ఆస్ట్ర్రేలియా సిరీస్ వరకూ మొత్తం 81 టెస్టులు ఆడి 18 శతకాలతో సహా 6 వేల 111 పరుగులు సాధించాడు. అంతేకాదు.. భారత టెస్టు చరిత్రలోనే మరే ఆటగాడు ఎదుర్కోని విధంగా 13వేల 572 బంతులు ఎదుర్కొని రికార్డు సృష్టించాడు.

అయితే.. 2010 జరిగిన టెస్టు మ్యాచ్‌ నుంచి పూజారా ఆటతీరును చూసిన భారత సెలెక్టర్లు అతన్ని టెస్టు క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేశారు. టీమిండియా ఏ టూర్‌కు వెళ్లిన భారత టెస్టు టీమ్‌లో కీలక సభ్యుడిగా పూజారాను చూస్తూ.. వచ్చారు. ప్రత్యర్థి బౌలర్లు ఎంత వేగవంతమైన బంతులు విసురుతున్నా.. ఓపిగ్గా ఎదుర్కొంటూ వికెట్‌ను కాపాడుకోవడం చటేశ్వర్‌ పుజారకు అలవాటు. దానిని గమనించిన సెలెక్టర్లు పూర్తిస్థాయిలో టెస్టు క్రికెట్‌కు పూజారాను పరిమితం చేశారు. దీంతో అతను వన్డే, టీ20 ఫార్మాట్‌లకు దూరం అయ్యాడు. అంతేగాకుండా.. టెస్టు స్పెషలి‌స్టుగా ముద్ర పడిన పుజారాపై సహజంగానే ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపడం లేదు.

కానీ, ఒక ఆటగాడిగా ప్రతీ ఒక్కరికీ అన్ని ఫార్మాట్‌లలో ఆడాలని ఉంటుంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ అంటే ప్రతీ క్రీడాకారునికి ఫేవరేట్. అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఐపీఎల్ అంటే అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. ఐపీఎల్ కోసం కేవలం మన దేశ ఆటగాళ్లే కాకుండా ఇతర దేశ ఆటగాళ్లు కూడా ఉత్సాహంతో ఎదురుచూస్తారు. అందులో భాగంగా ప్రస్తుతం.. నయావాల్ పూజారాకు కూడా కేవలం టెస్టు క్రికెట్‌కే పరిమితం కాకుండా అన్ని ఫార్మాట్‌లలో ఆడాలని ఉందని ప్రకటించాడు. అంతేగాకుండా తాను కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం కాదని.. పరిస్థితులకు తగ్గట్టు ఎలాగైనా ఆడగలననే విశ్వాసం ఉందని పుజారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రకటన చేశాడు. తనకూ ఐపీఎల్‌లో ఆడాలని ఉందని. అవకాశం ఇస్తే సత్తా నిరూపించకుంటాను అని పూజారా ధీమా ధీమా వ్యక్తం చేశాడు. మరి దీనిపై బీసీసీఐ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందోనని, ఐపీఎల్‌లో ఆడాలన్న పూజారా కల నెరవేరుస్తుందో లేదో అని క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Next Story

Most Viewed