నా కోరిక తీర్చు.. పరీక్షల్లో ఎక్కువ మార్కులేస్తా..

by  |
Father rapes daughter in hotel
X

దిశ, వెబ్‌డెస్క్ : విద్యా బుద్ధులు నేర్పా్ల్సిన గురువే.. విచక్షణ మరచి.. విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని.. అందుకు తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అసలు విషయం విద్యార్థి పేరెంట్స్‌కు తెలియడంతో టీచర్‌కు బాలిక తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. పుణెలోని విష్రమ్‌ బాగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ కళాశాలలో బాధిత యువతి చదుతువుతోంది. ఈ నేపథ్యంలో తన కోరిక తీర్చాలని అదే కళాశాలకు చెందిన ఉపాధ్యాయుడు బాలికను పదే పదే వేధింపులకు గురిచేశాడు. కోరిక తీరిస్తే.. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని చెప్పి.. లైంగిక వేధింపులకు దిగాడు. ఈ క్రమంలో.. విద్యార్థినికి ఉపాధ్యాయుడు ఫోన్‌ చేయగా.. అతడి మాటలను బాధిత యువతి రికార్డు చేసింది.

అనంతరం ఆ ఆడియోను కుటుంబ సభ్యులకు వినిపించింది. తన వేధిస్తున్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు.. టీచర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

pune

Next Story

Most Viewed