సీఎం, మంత్రులు ఇళ్లు కదలరు.. కానీ ప్రజలు రోడ్డున పడాలా ?

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-20 05:25:39  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: ఆధార్ అప్డేషన్ పేరుతో పేదల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ ప్రజల భద్రతను గాలికొదిలి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. ఈ-కేవైసీ ప్రజల సంక్షేమం కోసమా? వేధించడం కోసమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇళ్లు కదలరు కానీ పేదలు రోడ్డునపడాలా? అని నిలదీశారు. పేదప్రజలు పనులు మానుకొని ఈ-కేవైసీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. [&hellip;]</p>

సీఎం, మంత్రులు ఇళ్లు కదలరు.. కానీ ప్రజలు రోడ్డున పడాలా ?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆధార్ అప్డేషన్ పేరుతో పేదల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ ప్రజల భద్రతను గాలికొదిలి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. ఈ-కేవైసీ ప్రజల సంక్షేమం కోసమా? వేధించడం కోసమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇళ్లు కదలరు కానీ పేదలు రోడ్డునపడాలా? అని నిలదీశారు. పేదప్రజలు పనులు మానుకొని ఈ-కేవైసీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సంక్షేమ పథకాలను దూరం చేసేందుకే ఈ-కేవైసీ సాకుగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ-కేవైసీని నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని..అప్పటి వరకు షరతులు లేకుండా రేషన్ పంపిణీ చేయాలని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.

Next Story