డీజీపీ లేఖపై వర్ల రామయ్య అభ్యంతరం

by  |
డీజీపీ లేఖపై వర్ల రామయ్య అభ్యంతరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ నేతలు, మీడియా ప్రతినిధుల ఫోన్‌లను ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాయగా.. ఈ విషయంపై ఆధారాలు ఉంటే ఇవ్వాలని చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సోమవారం రాత్రి లేఖ రాశారు. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఇదే క్రమంలో చంద్రబాబుకు డీజీపీ లేఖ రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వర్ల రామయ్య.. సాక్షం ఇస్తేనే దర్యాప్తు చేస్తామనడం సరికాదని ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు లేఖ, పత్రికల్లో వార్తలను చూసి సుమోటోగా ఎందుకు కేసును నమోదు చేయడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పే దైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed