వరదలు అసహ్యం కలిగిస్తున్నాయా..?

12

దిశ, వెబ్‎డెస్క్ :
రాష్ట్రంలో వరదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా అంటూ సీఎం జగన్‎ను ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేష్. రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయని ట్విట్టర్‎లో పేర్కొన్నారు. పంటలు మునిగిపోయాయని.. రోడ్లు చెరువులయ్యాయని అన్నారు. సీఎం జగన్ జగన్‎కు ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై కంప్లయింట్లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా..? అని నిలదీశారు. ఒక్క రోజు అయినా కాలు బయటపెట్టి బాధితుల గోడు విన్నారా అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.