కాకినాడలో కొట్టేశారు.. మచిలీపట్నంలో మడతెట్టేశారు: దేవినేని ఉమ

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-05-19 02:22:46  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియా వేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర్రావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల కోసం మడ అడవులను ధ్వంసం చేయడంపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర్రావు ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. ఈ మేరకు ఒక వీడియోను పోస్టు చేస్తూ, దానికి &#8216;పర్యావరణాన్ని, తీర ప్రాంతాన్ని తుపానుల బారినుండి కాపాడుతున్న&#8221;మడ&#8221; అడవులను కాకినాడలో కొట్టేశారు.. బందరులో మడతపెట్టేశారు. మీ ప్రభుత్వం చేస్తున్న పర్యావరణ విధ్వంసం [&hellip;]</p>

కాకినాడలో కొట్టేశారు.. మచిలీపట్నంలో మడతెట్టేశారు: దేవినేని ఉమ
X

దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియా వేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర్రావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల కోసం మడ అడవులను ధ్వంసం చేయడంపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర్రావు ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. ఈ మేరకు ఒక వీడియోను పోస్టు చేస్తూ, దానికి ‘పర్యావరణాన్ని, తీర ప్రాంతాన్ని తుపానుల బారినుండి కాపాడుతున్న”మడ” అడవులను కాకినాడలో కొట్టేశారు.. బందరులో మడతపెట్టేశారు. మీ ప్రభుత్వం చేస్తున్న పర్యావరణ విధ్వంసం నుంచి కోర్టులు కాపాడుతున్నాయి. మడ అడవులు మాయం చేస్తున్న బాధ్యులపై ఏ చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారు’ అని వ్యాఖ్యానించారు.

Next Story