- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 30 లారీల స్వాధీనం.?
<p>దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి మానేరు నది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక క్వారీపై టాస్క్ ఫోర్స్ టీం దాడి చేసింది. అర్థరాత్రి అక్రమంగా ఇసుక లోడ్ చేసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న సీపీ సత్యనారాయణ స్పెషల్ టీంలను రంగంలోకి దింపినట్టు సమాచారం. శుక్రవారం తెల్లవారు జామున 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ టాస్క్ ఫోర్స్ టీం ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. నలుగురు సీఐలు, ఆరుగురు […]</p>

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి మానేరు నది నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక క్వారీపై టాస్క్ ఫోర్స్ టీం దాడి చేసింది. అర్థరాత్రి అక్రమంగా ఇసుక లోడ్ చేసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న సీపీ సత్యనారాయణ స్పెషల్ టీంలను రంగంలోకి దింపినట్టు సమాచారం. శుక్రవారం తెల్లవారు జామున 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ టాస్క్ ఫోర్స్ టీం ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్సైలతో పాటు సుమారు 20 మంది పోలీసులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ దాడుల్లో కొంతమంది లారీ డ్రైవర్లు పరార్ కావడంతో ఆరు లారీలను అక్కడే వదిలేసిన పోలీసు అధికారులు 30 లారీలను మాత్రం కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)కి తరలించినట్టు తెలిసింది. క్వారీ సమీపంలో వదిలేసిన లారీలను కూడా సీటీసీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.






