తారక్ ఫ్యాన్స్‌కు ‘ఆర్ఆర్ఆర్’ ట్రీట్?

by  |
తారక్ ఫ్యాన్స్‌కు ‘ఆర్ఆర్ఆర్’ ట్రీట్?
X

‘రణం రుధిరం రౌద్రం..’ బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్.. తెరపై కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. ఆ తర్వాత లాక్‌డౌన్ కష్టాలు వెంటాడాయి. అయినా సరే చరణ్ పుట్టినరోజున ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు జక్కన్న. దీంతో ఎన్టీఆర్ పుట్టినరోజున కూడా స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని జూనియర్ అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అటువంటిదేమీ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆగ్రహంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌పై విమర్శల వర్షం కురిపించారు. దీంతో సీన్‌లోకి ఎంటరైన తారక్.. పరిస్థితిని అర్థం చేసుకోవాలని అభిమానులను కోరడంతో శాంతించినా.. ఆ కోపం మాత్రం అలాగే ఉండిపోయింది.

అయితే జూన్ నుంచి ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు అనుమతిస్తుంది కనుక వెంటనే తారక్‌పై షూటింగ్ కంప్లీట్ చేసి, ముందుగా ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేయాలని చూస్తున్నారట జక్కన్న. అభిమానుల ఆగ్రహం నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత సేఫ్ అనే ఆలోచనలో ఉన్నాడట. సో.. నందమూరి ఫ్యాన్స్‌కు త్వరలో సర్‌ప్రైజ్ వీడియో రాబోతోందన్న మాట.


Next Story