అల్లు అర్జున్ బిగ్ డీల్.. సీన్‌లోకి తమిళ్ ప్రొడ్యూసర్!

by  |
అల్లు అర్జున్ బిగ్ డీల్.. సీన్‌లోకి తమిళ్ ప్రొడ్యూసర్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్స్‌లో ఒకరైన అల్లు అర్జున్.. ఐకానిక్ స్టార్‌గా ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. దాదాపు 20 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకున్న బన్నీ, ఈ క్రమంలో మాసివ్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. తన సినిమా రిలీజ్‌ కోసం రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎదురు చూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. తను ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో ‘పుష్ప’ మూవీ చేస్తుండగా.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘అల వైకుంఠపురంలో’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన బన్నీతో ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఇప్పటికే కన్‌ఫర్మ్ చేసిన ప్రొడ్యూసర్.. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను పాపులర్ తమిళ్ డైరెక్టర్ తెరకెక్కించనున్నారని వెల్లడించారు. అయితే ఆ డైరెక్టర్ మురుగదాస్ అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా.. అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇక ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా సౌత్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీలో ఆగస్టు 13న విడుదల కానుంది.



Next Story

Most Viewed