- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా‘గే’.. అనలేదని!
<p>దిశ, వెబ్‌డెస్క్: తనతో అసహజంగా లైంగిక సంబంధం పెట్టుకోలేదని ఓ వ్యక్తిని తన స్నేహితుడే చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అకోలా జిల్లాకు చెందిన బండు ఇంగ్లే(40), ఉత్తరప్రదేశ్ కు చెందిన వీరేంద్ర కుమార్ సింగ్(20)లు స్నేహితులు. వీరిద్దరూ ఒకేచోట పని చేస్తుంటారు. అయితే పలుమార్లు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బండు ఇంగ్లేను వీరేంద్ర కుమార్ సింగ్ కోరాడు. అయితే అందుకు బండు అంగీకరించకపోవడంతో ఆయనపై సింగ్ కక్ష […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తనతో అసహజంగా లైంగిక సంబంధం పెట్టుకోలేదని ఓ వ్యక్తిని తన స్నేహితుడే చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అకోలా జిల్లాకు చెందిన బండు ఇంగ్లే(40), ఉత్తరప్రదేశ్ కు చెందిన వీరేంద్ర కుమార్ సింగ్(20)లు స్నేహితులు. వీరిద్దరూ ఒకేచోట పని చేస్తుంటారు. అయితే పలుమార్లు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బండు ఇంగ్లేను వీరేంద్ర కుమార్ సింగ్ కోరాడు. అయితే అందుకు బండు అంగీకరించకపోవడంతో ఆయనపై సింగ్ కక్ష పెంచుకుని ఎలాగైనా చంపాలనుకున్నాడు. అందుకు పథకం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంగ్లే తలపై సింగ్ రాయితో మోది, అనంతరం బీరు బాటిల్ తో పొడిచాడు. దీంతో ఇంగ్లే మృతిచెందాడు. వెంటనే మృతదేహాన్ని వాడ్ గావ్ బడ్రూక్ లోని ఓ కాలేజీ సమీపంలో తగులబెట్టాడు. ఉదయం స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఇంగ్లేను తానే చంపినట్లు నిందితుడు సింగ్ ఒప్పుకున్నాడు.
tags :tamil nadu, victim bandhu, sinhagad police, unnatural sex, arrested, crime






