పవన్ యువతకు స్ఫూర్తి : తమన్నా

by  |
పవన్ యువతకు స్ఫూర్తి : తమన్నా
X

మిల్కీ బ్యూటి తమన్నా… సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ డాల్‌గా పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్ట్స్ చేసిన ఈ భామ… ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేయడంలో బిజీగా ఉంది. ‘బాహుబలి’ సినిమాతో ఆకట్టుకున్న ఈ అమ్మడు… మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’లో తన నటనతో మెప్పించింది. సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసి యూత్‌తో స్టెప్పులు వేయించింది.

సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించి పలు విషయాలను షేర్ చేసుకుంది. చాలా కాలం తర్వాత ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో లైవ్‌లో మాట్లాడిన భామ… సినిమా జీవితం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలు, తన ఇష్టాయిష్టాలను పంచుకుంది.

సినిమాను కెరియర్‌గా ఎంచుకోవాలి అనుకున్నప్పుడు మీ ఆలోచనలు ఏంటి అన్న అభిమాని ప్రశ్నకు… ప్రతీ సారి కెమెరా ముందు నిలబడినప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని అనుకున్నాను అని తెలిపింది. ఒక సినిమాను
సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి టీం, ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, ఆ సినిమాలో తన పాత్రను పరిగణలోకి తీసుకుని … అన్నీ నచ్చితేనే ఓకే చేస్తానని తెలిపింది. యాక్షన్, కామెడీతో కూడిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించాలని ఉందన్న తమ్మూ బేబి… తను చేసిన అన్ని సినిమాల్లోనూ ‘బాహుబలి’లో తన రోల్ ఛాలెంజిగ్‌గా అనిపించిందని తెలిపింది. ఈ సినిమా చాలా సంతృప్తినిచ్చిందని చెప్పింది.

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క వర్డ్ చెప్పమన్న అభిమాని ప్రశ్నకు… పవన్ యంగ్ జనరేషన్‌కు ఒక స్ఫూర్తి అని బదులిచ్చింది తమన్నా. సమంత గురించి అడిగిన ప్రశ్నకు కాంప్లిమెంట్ ఇచ్చిన మిల్కీ బ్యూటి… సామ్‌కు అందంతో పాటు హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే అని చెప్పింది. ఇక హీరో సూర్యతో ఛాన్స్ వస్తే ఏం చేస్తారని అడగ్గా.. గంతులేసినంత పని చేసింది తమ్మూ… తనతో వర్క్ చేయడం తన కల అని.. ఇప్పటికే సూర్యతో కలిసి చేసినా మళ్లీ ఛాన్స్ వస్తే వదులుకోనని తెలిపింది. దర్శకుడు సంపత్ నందితో మూడో సినిమా చేస్తున్న తమన్నా.. ఇందులో కబడ్డీ కోచ్‌గా ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకుంది. గోపిచంద్, సంపత్ నందితో కలిసి వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉందని తెలిపింది.

కుటుంబ సభ్యులు, స్నేహితులు తనను తమ్మూ అని ముద్దుగా పిలుస్తారన్న తమన్నా…. పావ్ బాజీ తన ఫేవరెట్ డిష్ అని చెప్పింది. ప్రపంచంలోనే తనకు ఇష్టమైన ప్లేస్ ఇళ్లు అని తెలిపింది. జీవితంలో స్నేహితులను పొందడం గొప్ప వరం అని… మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిలబెట్టేది ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇక తనకు టెబుల్ టెన్నిస్ అంటే ఇష్టమని … కానీ అది హాబీ మాత్రమేనని తెలిపింది.

మెగా అల్లుడికి బిగ్ వెల్‌కమ్



Next Story

Most Viewed