9/11 రోజున ఏం జరగనుంది.. తాలిబన్ల సంచలన ప్రకటన.!

348

దిశ, వెబ్‌డెస్క్ : అప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు సంచలన ప్రకటన చేయబోతున్నారా.. సెప్టెంబర్ 11వ తేదీన(9/11) అప్ఘనిస్తాన్‌లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. తాలిబన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ఓ ప్రకటన చేశారు. అప్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసింది అని.. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని కామెంట్స్ చేశాడు.

అయితే.. అప్ఘనిస్తాన్‌లో అరాచకాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ప్రజలపై కాల్పులు జరపడంతో పదుల సంఖ్య అప్ఘన్లు మృతి చెందారు. అంతేకాకుండా తాలిబన్లు మీడియాపై కూడా ఆంక్షలు విధించారు.

అయితే.. తాలిబన్లతో కలిసి అధికారం పంచుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో పంజ్ షేర్ రెసిస్టెంట్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి దాస్తీ ఒకరు. యుద్ధంతో చిన్నాభిన్నామైన ప్రజలకు మంచి జీవితాలు అందించేందుకు తమ దళాలు చనిపోయేందుకు కూడా సిద్ధమేనని దాస్తీ ఒక సందర్భంలో వెల్లడించారు. గతంలోనూ ఈయన వెంట్రుకవాసిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు.

9/11దాడికి ముందు పంజ్ షేర్ నాయకుడు అహ్మద్ మసూద్ పై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. అయితే దాస్తీ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా జరిగిన తాలిబన్ల దాడిలో రెసిస్టెంట్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి ఫాహీమ్ దాస్తీ అమరుడైనట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ ట్విన్‌ టవర్స్ మీద 2001 సెప్టెంబర్ 11న (9/11) దాడులు జరిగిన విషయం తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..