T20 worldcup: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

by  |
Australia vs West Indies
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 03 : 30 కి షేక్ జాయెద్ అబుదాబి స్టేడియం(దుబాయ్) వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. శ్రీలంక మీద ఓటమి చెంది ఇప్పటికే ఇంటిబాట పట్టిన వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాపై ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం, 3 పరాజయాలతో సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు ప్రతిష్టాత్మకం కానుంది. ఇందులో గెలిస్తే నేరుగా సెమీస్ చేరనుంది. ఓడితే ఆస్ట్రేలియా సైతం ఇంటిబాట పట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. మరి ఎవరిపై ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.


Next Story