T20 WorldCup: ఆ జట్టుతో భారత్‌కి ముప్పు.. సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు

by  |
Suresh Raina
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24న భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇరు జట్లు ఒకరికొకరితో తలపడనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. T20 ప్రపంచకప్‌లో భారత్‌కు వెస్టిండీస్ జట్టు నుండే చాల ప్రమాదం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలార్డ్ నాయకత్వంలోని విండీస్ జట్టులో గేల్, రస్సెల్, బ్రావో, పూరన్ లాంటి విధ్వంసకర బ్యాటర్స్ ఉండటం వల్ల ఈ జట్టు నుండే భారత్‌కి అధిక ప్రమాదం ఉందని సూచనలు చేశారు.

ప్రస్తుతం సూపర్ 12లో ఈ రెండు జట్లు వేరు వేరు గ్రూపుల్లో ఉన్నప్పటికీ తదుపరి మ్యాచుల కోసం అప్రమత్తంగా ఉండాలని రైనా హెచ్చరించాడు. విండీస్ జట్టుతో తలపడే అవకాశం ఉంటే మాత్రం భారత బౌలర్లు పవర్ ప్లేలోనే సాధ్యమైనన్ని వికెట్లు తీయ్యాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే ఈ జట్టులో ఆడే మొదటి బ్యాటర్ నుండి చివరి బ్యాటర్ వరకు అందరూ భారీ సిక్సులు కొట్టగలిగే సమర్థులు అని వ్యాఖ్యానించారు. కేవలం విండీస్ మాత్రమే కాకుండా శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ జట్ల నుండి కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎందుకంటే UAEలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకులిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుత భారత జట్టు ధోని మెంటర్‌గా ఉండటం వల్ల మానసికంగానూ పటిష్టంగా ఉందని అభిప్రాయపడ్డాడు.


Next Story

Most Viewed