భారత్ దిగుమతి చేసుకునే బంగారం.. ఆ దేశంలోనిదే ..

by  |
భారత్  దిగుమతి చేసుకునే బంగారం.. ఆ దేశంలోనిదే ..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ దిగుమతి చేసుకునే బంగారంలో దాదాపు సగం స్విట్జర్లాండ్ నుంచే వస్తుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గణాంకాల ప్రకారం.. భారత్ మొత్తం 34.6 బిలియన్ డాలర్ల(రూ. 2.6 లక్షల కోట్ల) విలువైన బంగారం దిమతి చేసుకుంది. ఇందులో 16.3 బిలియన్ డాలర్లు(రూ. 1.21 లక్షల కోట్ల) విలువైన పసిడి స్విట్జర్లాండ్ నుంచే రావడం గమనార్హం. కరోనా మహమ్మారికి ఉన్న ఏడాదిలో కంటే గత ఆర్థిక సంవత్సరంలో మనదేశం 6.4 బిలియన్ డాలర్లు(రూ. 47.7 వేల కోట్లు) విలువైన బంగారాన్ని అధికంగా దిగుమతి చేసుకుంది.

స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు 7.8 శాతం పెరిగి 18.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీనివల్ల స్విట్జర్లాండ్ నాలుగో అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచింది. ఇదివరకు ఈ స్థానంలో సౌదీ అరేబియా ఉండగా, చైనా నుంచి దిగుమతులు 0.7 శతం క్షీణించి 65.21 బిలియన్ డాలర్లు(రూ. 4.86 లక్షల కోట్లు)గా ఉన్నాయి. వస్తు, సేవలు అన్ని రకాల దిగుమతుల్లో ఇప్పటికీ చైనానే అత్యధిక వాటా కలిగి ఉంది. దీని తర్వాత అమెరికా, యూఏఈ ఉన్నాయి. ఇక, బంగారం వాడకంలో చైనా తర్వాత భారత్‌దే తర్వాతి స్థానం. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం శుద్ధికేంద్రంగా స్విట్జర్లాండ్ ఉంది. ఆ దేశంలో అత్యంత నాణ్యమైన బంగారం లభిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అతిపెద్ద రవాణ కేంద్రం కావడంతో బంగారంపై 12.5 శాతం నుంచి 10 శాతానికి పన్నులను తగ్గించింది.



Next Story

Most Viewed