- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు రోజుల్లో 16 మంది అనుమానస్పద మృతి
by Batti.Sumithra |
<p>పాట్నా: బీహార్‌లో అనుమానస్పద మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ చంపారన్ జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరిలో 8 మంది బుధవారం మృతి చెందగా, మరో 8 మంది శుక్రవారం మరణించారని పోలీసులు తెలిపారు. కల్తీ మద్యం సేవించడం వల్లే వీరు మరణించారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కాగా మరణాల గురించి శుక్రవారం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను పోలీసులు […]</p>

X
పాట్నా: బీహార్‌లో అనుమానస్పద మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ చంపారన్ జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరిలో 8 మంది బుధవారం మృతి చెందగా, మరో 8 మంది శుక్రవారం మరణించారని పోలీసులు తెలిపారు. కల్తీ మద్యం సేవించడం వల్లే వీరు మరణించారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కాగా మరణాల గురించి శుక్రవారం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడామని అధికారి కుందన్ కుమార్ తెలిపారు. విచారణ సందర్భంగా ఘటనకు కల్తీ మద్యమే కారణమంటూ ఎవరూ వెల్లడించలేదని అన్నారు. దీనిపై కేసు ఫైల్ చేశామని, విచారణ కొనసాగుతోందని పేర్కొ న్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
Next Story






