- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెడ్రూమ్ కిటికిల్లోంచి చూసిన అన్న.. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు
<p>దిశ, జల్పల్లి: అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పహాడిషరీఫ్పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. పహాడిషరీఫ్ఎస్సై మధుసూధన్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీగూడ వాసవికాలనీకి చెందిన కమలేష్ శర్మ (35) ఇంటికి ఈ నెల 8వ తేదీన రాత్రి 8గంటలకు సోదరుడు శంకర్ లాల్ శర్మ వెళ్లాడు. ఎంత సేపు పిలిచినా పలకకపోవడంతో బెడ్రూమ్వెనుక వైపు ఉన్న కిటికీలోంచి తొంగిచూడగా బాత్రూమ్లో సోదరుడి ఒక చేయి మాత్రమే కనిపిస్తుండడంతో వెంటనే 100కు డయల్చేసి ఫిర్యాదు చేశాడు. […]</p>

దిశ, జల్పల్లి: అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పహాడిషరీఫ్పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. పహాడిషరీఫ్ఎస్సై మధుసూధన్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీగూడ వాసవికాలనీకి చెందిన కమలేష్ శర్మ (35) ఇంటికి ఈ నెల 8వ తేదీన రాత్రి 8గంటలకు సోదరుడు శంకర్ లాల్ శర్మ వెళ్లాడు. ఎంత సేపు పిలిచినా పలకకపోవడంతో బెడ్రూమ్వెనుక వైపు ఉన్న కిటికీలోంచి తొంగిచూడగా బాత్రూమ్లో సోదరుడి ఒక చేయి మాత్రమే కనిపిస్తుండడంతో వెంటనే 100కు డయల్చేసి ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పహాడిషరీఫ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడడంతో కమలేష్ఉరివేసుకుని కనిపించాడు. తన సోదరుడు కమలేష్మృతికి నరేందర్ కుమార్ చౌదరే కారణమని శంకర్ లాల్ అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
- Tags
- Man






