సుశాంత్, సారా ప్రేమలో ఉండేనా?

by  |
సుశాంత్, సారా ప్రేమలో ఉండేనా?
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కచ్చితంగా న్యాయం జరుగుతుందని ధీమాతో ఉన్నారు. అయితే సుశాంత్ విషయంలో నెట్టింట్లో రోజుకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటకు వచ్చినట్లే.. ఈ రోజు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజాగా సుశాంత్ ఫ్రెండ్ శామ్యూల్ హావుకిప్.. ‘కేదార్‌నాథ్’ సినిమా సమయంలో ఆ సినిమా హీరో, హీరోయిన్లు సుశాంత్, సారా అలీ ఖాన్ ప్రేమలో ఉన్నారని పోస్ట్ పెట్టాడు. వారిద్దరి మధ్య చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉండేదని.. ఒకరినొకరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకునేవారని తెలిపాడు. అలాంటి ప్రేమ ఈ కాలంలో లేదన్న సుశాంత్ స్నేహితుడు.. సుశాంత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్టాఫ్ మెంబర్స్‌కు కూడా సారా చాలా రెస్పెక్ట్ ఇచ్చేదన్నాడు. కానీ ‘సొంచిరియా’ బాక్సాఫీస్ వద్ద విఫలమవడమో లేక మూవీ మాఫియా ఒత్తిడో తెలియదు కానీ సారా సుష్‌కు బ్రేకప్ చెప్పేసింది అన్నాడు.

Next Story

Most Viewed