మొబైల్ యాప్స్.. ఆరోగ్య స్థితిని గుర్తించలేవు

by  |
మొబైల్ యాప్స్.. ఆరోగ్య స్థితిని గుర్తించలేవు
X

దిశ, సూర్యాపేట: మన రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసే మొబైల్ అప్లికేషను డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని సూర్యపేట ఎస్పీ ఆర్ భాస్కరన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మొబైల్ యాప్స్ ఆరోగ్య స్థితిని కానీ, ఆనారోగ్యాన్ని కానీ, బీపీ, పల్స్, ఆక్సిజన్ శాతాన్ని కానీ గుర్తించలేవని తెలిపారు. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఇలాంటి యాప్స్ ద్వారా మీ వెలి ముద్రలు సేకరించి మీ విలువైన సమాచారాన్ని దొంగిలించి, ఆర్ధిక నష్టాన్ని కలగజేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న సరికొత్త సైబర్ ఎత్తుగడ అని, ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు అన్నారు.


Next Story

Most Viewed