పొమ్మన్నవారే ఇప్పుడు రమ్మంటున్నారు..

by  |
పొమ్మన్నవారే ఇప్పుడు రమ్మంటున్నారు..
X

దిశ, సినిమా: హాట్ బాంబ్ సన్నీలియోన్ ఉమెన్స్ డే సందర్భంగా తన లైఫ్ జర్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అవార్డ్ ఫంక్షన్స్ బాయ్ కాట్, విమర్శల నుంచి ప్రొఫెషనల్ సక్సెస్, పర్సనల్ లైఫ్ హ్యాపీనెస్ గురించి అభిమానులతో పంచుకుంది. సన్నీ లియోన్ లైఫ్ 180 డిగ్రీలు టర్న్ అయింది. పోర్న్ వీడియోస్ ద్వారా 21 ఏళ్లలో హేట్ మెయిల్స్ అందుకున్న ఆమె సెక్సిస్ట్ కామెంట్స్‌‌తో పోరాటం చేస్తూనే డ్యాన్స్ మూవ్స్‌పై విమర్శలు ఎదుర్కొంది. పరిశ్రమ నుంచి ఆఫర్లు లేక సతమతమైపోయింది.

అవార్డ్స్ ఫంక్షన్ నుంచి కూడా బాయ్ కాట్ చేయబడిన సన్నీ ప్రస్తుతం తనకు నచ్చిన డ్రీమ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. ‘బేబీ డాల్‌’తో ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తను ప్రస్తుతం భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. మోజ్ ఇండియా లాంచ్ చేసిన ‘అన్‌ఫిల్టర్’ క్యాంపెయిన్‌లో భాగంగా సన్నీలియోన్ తన స్టోరీని షేర్ చేయగా నెటిజన్ల నుంచి కాంప్లిమెంట్స్ అందుతుండటం విశేషం.

Next Story

Most Viewed