మిస్టరీ మొక్క.. టచ్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటారంట !

by Vadlamudi Anukaran |   (  Updated:2021-12-15 22:57:58  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : మొక్కలు అంటే చాలా మందికి ఇష్టం. తమకు నచ్చిన మొక్క లన్నింటినీ ఇంటి ఆవరణంలో నాటుతూ ఉంటారు. ఇక ఏ మొక్క చూసిన భలే అనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని మొక్కలను చూస్తే ముట్టుకోవాలంటే కూడా భయపడతారు. మొక్కలను ముట్టుకుంటే భయపడటం ఏంటి అనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి. ప్రతి మొక్కలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఏదో విధంగా సహాయపడుతాయి. అయితే ముట్టుకుంటే ప్రాణాలు పోగొట్టే మొక్కలు [&hellip;]</p>

మిస్టరీ మొక్క.. టచ్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటారంట !
X

దిశ, వెబ్‌డెస్క్ : మొక్కలు అంటే చాలా మందికి ఇష్టం. తమకు నచ్చిన మొక్క లన్నింటినీ ఇంటి ఆవరణంలో నాటుతూ ఉంటారు. ఇక ఏ మొక్క చూసిన భలే అనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని మొక్కలను చూస్తే ముట్టుకోవాలంటే కూడా భయపడతారు. మొక్కలను ముట్టుకుంటే భయపడటం ఏంటి అనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి.

ప్రతి మొక్కలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఏదో విధంగా సహాయపడుతాయి. అయితే ముట్టుకుంటే ప్రాణాలు పోగొట్టే మొక్కలు కూడా ఉన్నాయి. అదే గింపీ గింపీ. దీన్ని చూడటానికి చిన్నగా రావి ఆకులు పోలినట్లుగా ఉంటుంది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఈ మొక్క చూస్తే అరే చాలా చిన్నగా ఉంది అనుకుంటారు. కానీ దాన్ని ముట్టుకుంటే తెలుస్తోంది దాని పవర్ ఏంటో. ప్రపంచంలోనే అతి భయంకరమైన మొక్కల్లో గింపీ గింపీ ఒకటి. ఇది ఆస్టేలియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మొక్కకు ఎవరైనా సరే ఆమడ దూరంలో ఉంటారంట.

గింపీ గింపీ.. టచ్ చేస్తే షాకే

అయితే చిన్నగా ఉండే ఈ చెట్టు ఆకుల పై సన్నని ముళ్ళు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే ఇక అంతే సంగతి కనీసం బయటకు తీయడం కూడా రాదు అంత ఘోరంగా ఉంటుందంట పరిస్థితి. ఇక ఈ మొక్క సైంటిఫిక్ పేరు డెండ్రోక్నైడ్ మొరాయిడెస్. ఈ ఆకుల ముళ్లలో ఒక రకమైన విషం ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకోగానే, ఆ విషం మన శరీరంలో కలుస్తుంది. పాములు, తేళ్లలో ఉన్న విషం వ‌ల‌న మ‌న‌కు ఎంత హాని క‌లుగుతుందో ఈ మొక్కల‌లో ఉండే విషం వ‌ల‌న అంతే హాని క‌లుగుతుంద‌ట. అంతే కాకుండా ఈ మొక్కలు నీరు లేని సమయంలో ఎండి పోతాయంట, కానీ ఎండిపోయిన మొక్కలను ముట్టుకున్నా ప్రమాదమే అంటున్నారు శాస్త్రవేత్తలు.

టచ్ చేశా నరకం చూశా..

ఇంతలా చెప్పుకుంటున్న ఈ మొక్క ‌ను ఎవరైనా ముట్టుకున్నారా.. అనే అనుమానం కూడా చాలా మందిలో కలుగుతుంది. నిజంగానే ఈ మొక్కవలన ప్రాణాపాయం ఉందా అని క్వాన్స్‌లాండ్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్‌కి చెందిన సీనియర్ కన్జర్వేషన్ ఆఫీసర్ ఎర్నీ రైడర్ ధైర్యంగా ఈ మొక్కను ముట్టుకున్నాడు. ఆ తర్వాత అతని బాధ వర్ణనాతీతం. కొన్ని రోజులు నరకం చూశాడంట. కానీ రెండు సంవత్సరాల తర్వాత ఆ నొప్పి భరించి మెల్లిగా కోలుకున్నాడు.

..ఎర్నీ రైడర్

Next Story