పార్లమెంట్ సమావేశాలు - శాసన ప్రక్రియ

by Disha Web Desk 17 |
పార్లమెంట్ సమావేశాలు - శాసన ప్రక్రియ
X

పార్లమెంట్ ఏడాదికి మూడు సార్లు సమావేశమవుతుంది.

1. బడ్జెట్ సమావేశాలు

2. వర్షాకాల సమావేశాలు

3. శీతాకాల సమావేశాలు

రాష్ట్రపతి ఏడాది మొదటి సమావేశంలో అనగా బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక ప్రసంగం చేస్తారు.

ఈ ప్రసంగం తయారు చేసేది - మంత్రిమండలి/కేబినెట్

ప్రసంగం అనంతరం సభ్యులు రాష్ట్రపతికి కృతజ్ఞతలు/ధన్యవాదాలు తెలుపుతారు.

ఓటింగ్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తారు.

ఆ ఓటింగ్ లో ప్రసంగానికి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు వస్తే .. అనగా ధన్యవాద తీర్మానం ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి.

రాష్ట్రపతి కొత్త సభ ఏర్పడ్డప్పుడు ప్రత్యేకంగా ప్రసంగిస్తాడు.

పార్లమెంట్ సమావేశాలు హాజరు:

సభ్యులు అందరూ హాజరు కావలసి ఉంటుంది.

చర్చల్లో పాల్గొన వచ్చు, ప్రసంగించవచ్చు, ఓటు వేయవచ్చు.

మంత్రుల హాజరు: మంత్రులు ఏ సభలోనైనా హాజరు కావచ్చు.

చర్చల్లో పాల్గొనవచ్చు.

ప్రసంగించవచ్చు.

కానీ ఏ సభలో సభ్యత్వం ఉంటే ఆ సభలో ఓటు వేయవచ్చు.

అటార్నీ జనరల్ హాజరు:

సమావేశాలకు హాజరు కావచ్చు.

చర్చలో పాల్గొనవచ్చు.

ప్రసంగించవచ్చు

కానీ ఓటు వేయరాదు.

శాసన ప్రక్రియ:

బిల్లు: చట్టం చేయదలుచుకున్న అంశాలతో కూడినది.

చట్టం లేదా శాసనం: ఉభయసభలు ఆమోదించబడి, రాష్ట్రపతి ఆమోదిస్తే ఆ బిల్లు చట్టం అవుతుంది.

బిల్లు రకాలు:

1. సాధారణ బిల్లు

2. ఆర్థిక బిల్లు

3. రాజ్యాంగ సవరణ బిల్లు

సాధారణ బిల్లు: ఒక బిల్లు ఆమోదించే ప్రక్రియాలో 3 దశలు ఉంటాయి.

1. సభకు ముందు

2. సభలో

3. సభ తర్వాత

సభకు ముందు:

ఒక శాఖమంత్రి బిల్లు తయారు చేసి దాని ప్రతిని న్యాయ శాఖకు పంపిస్తాడు

న్యాయశాఖ బిల్లు లోని అంశాలను పరిశీలించి రాజ్యాంగ విరుద్ధం మైనా అంశాలున్నాయా? చట్ట విరుద్ధంగా ఉన్నాయా..? అనేది పరిశీలిస్తుంది.

ఆ శాఖ మంత్రి బిల్లును కేబినేట్ ముందుకు తీసుకొస్తాడు.

మంత్రి మండలి లోక్ సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది.

కేబినేట్ ఆమోదిస్తే ఆ శాఖ మంత్రి ఆ బిల్లును సభ అధ్యక్షుడి అనుమతితో సభలో ప్రవేశపెడతాడు.

సభలో చర్చ అనంతరం బిల్లుపై ఓటింగ్ ఉంటుంది.

ఉభయ సభలు ఆమోదిస్తే బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళుతుంది.

ఏ ఒక్క సభలో ఆమోదం పొందక పోయినా రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.

ఉభయ సభల మీటింగ్ సాధారణ బిల్లులకు మాత్రమే ఉంటుంది.

సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభలకు సమాన అధికారులు ఉన్నాయి.

ఉభయ సభల సమావేశం:

దీనిని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు.

ఉభయసభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది స్పీకర్.

స్పీకర్ లేకపోతే ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.

డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేకపోతే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అధ్యక్షత వహిస్తారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అందుబాటులో లేకపోతే రాష్ట్రపతి చే నియమించబడే సభా సభ్యుడు అధ్యక్షత వహిస్తారు.

ఉభయ సభల మీటింగ్ లో 1/2 మెజారిటీతో బిల్లు నెగ్గాలి.

ఉభయ సభలు ఆమోదించిన తర్వాత బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరుతుంది.

ఉభయ సభలు ఆమోదించిన సాధారణ బిల్లును రాష్ట్రపతి :

1. ఆమోదించినప్పుడు ఆ బిల్లు చట్టం అవుతుంది.

2. తిరస్కరిస్తే ఆ బిల్లు రద్దవుతుంది.

3. సవరణలు /పున: పరిశీలన తర్వాత తిరిగి ఆ బిల్లు ఉభయ సభలకు చేరుతుంది.

ఉభయ సభలు 2వ సారి అదే బిల్లును అదే విధంగా లేదా సవరణలతో రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించాలి.

4. రాష్ట్రపతి తన నిర్ణయం తెలపకుండా ఉండవచ్చు. (ఎన్ని రోజులైనా)

ఇప్పటి వరకు జరిగిన ఉభయ సభల సమావేశాలు:

ఇప్పటి వరకు 3 సార్లు ఈ మీటింగ్ జరిగింది.

1961 - వరకట్న నిషేధ బిల్లు

1978 - బి ఎస్ ఆర్ బి (బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు)

2002: POTA (ఉగ్రవాదులకు సంబంధించినది)

పై మూడు సమావేశాలలో పాల్గొన్న వారు - వాజ్‌పేయి.

ఉభయ సభలను ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి సమావేశ పరుస్తాడు.

ఆర్థిక బిల్లు: ఒక బిల్లు ఆర్థిక బిల్లా ? కాదా? అని నిర్ణయించేది - లోక్‌సభ స్పీకర్

ఆర్థిక బిల్లును రాష్ట్రపతి పూర్వానుమతితో లేదా సిఫార్సుతో ముందుగా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి.

లోక్ సభ ఆమోదించిన ఆర్థిక బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు/తిరస్కరించవచ్చు/ సవరణాలు సూచించవచ్చు/14 రోజులు నొక్కి పెట్టవచ్చు.

ఆర్థిక బిల్లు విషయంలో రాజ్యసభకి ఉన్న అధికారాలు పరిమితం

రాజ్యసభ నిర్ణయాలను లోక్‌సభ ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోవచ్చు

ఉభయ సభలు ఆమోదించిన ఆర్థిక బిల్లును రాష్ట్రపతి : 1. ఆమోదించవచ్చు. 2. తిరస్కరించవచ్చు. 3. నొక్కిపెట్టవచ్చు. కాని పున: పరిశీలన, సవరణలు చేయరాదు.

నోట్: ఆర్థిక బిల్లు విషయంలో లోక్‌సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి.

రాజ్యాంగ సవరణ బిల్లు:

రాజ్యాంగంలో ఇది 20వ భాగం. దీనిని ఆర్టికల్ 368 లో పొందుపరిచారు.

రాజ్యాంగ సవరణ విధానం దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు.

నోట్: రాజ్యాంగ సవరణ పద్దతుల్లో ఉభయ సభలు 2/3వ వంతు ఆమోదం, సగం రాష్ట్రాలు ఆమోదించాలి అనేది మాత్రం అమెరికా నుండి గ్రహించారు.

రాజ్యాంగ సవరణ చేసేది - పార్లమెంట్

రాజ్యాంగ సవరణ బిల్లు ప్రక్రియ:

రాజ్యాంగ సవరణ విధానం 2/3 పద్దతి:

ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు.

ఉభయ సభలు విడివిడిగా 2/3వ వంతుతో ఆమోదించాలి.

ఉభయ సభలు ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి.

2/3 వ పద్ధతి +సగం రాష్ట్రాల పద్ధతి:

బిల్లును ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు.

ఉభయ సభలు 2/3తో ఆమోదించాలి.

ఉభయ సభలు ఆమోదించిన సవరణ బిల్లును సగం రాష్ట్రాలు ఆయా సభలలో 1/2 మెజారిటీతో ఆమోదించాలి.

అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టం అవుతుంది.


Next Story

Most Viewed