ఇండియన్ పాలిటీ.. ప్రాథమిక హక్కులు

by Disha Web Desk 17 |
ఇండియన్ పాలిటీ.. ప్రాథమిక హక్కులు
X

స్వేచ్ఛా హక్కు..

ఇండియన్ పాలిటీ.. ప్రాథమిక హక్కులు

స్వేచ్ఛా.. స్వాతంత్రపు హక్కు (19-22)

ఆర్టికల్- 19: స్వేచ్ఛా హక్కు (ఆరు రకాల స్వేచ్ఛలు)

ఆర్టికల్- 20: శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు

ఆర్టికల్ - 21: జీవించే హక్కు

ఆర్టికల్ - 22: అరెస్టు నుండి రక్షణ పొందే హక్కు.

ఆర్టికల్ - 19 స్వేచ్ఛా హక్కు:

19(1ఎ): వాక్ స్వాతంత్ర, భావ ప్రకటన స్వేచ్ఛ.

19(1బి): ఆయుధాలు ధరించకుండా శాంతి యుతంగా సమావేశాలు నిర్వహించుకోవచ్చు.

19 (1సి): సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు.

19 (1డి): దేశ వ్యాప్త సంచార స్వేచ్ఛ.

19(1ఇ): దేశవ్యాప్తంగా ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు.

19 (1జి): ఇష్టం వచ్చిన వృత్తి వ్యాపారం చేసుకోవచ్చు.

నోట్: 19(1 ఎఫ్): ఆస్తి సంపాదించుకోవచ్చు. దీనిని 44వ సవరణ ద్వారా తొలగించారు.

వాక్ స్వాతంత్ర.. భావ ప్రకటన:

19(1 ఎ): వాక్ స్వాతంత్రం భావ ప్రకటన గురించి పేర్కొంటుంది.

దీనిలో పరోక్షంగా ఉన్న అంశాలు:

1. పత్రికా స్వేచ్ఛ:

పత్రికలకు సెన్సార్ ఉండదు.

బ్రిటిష్ కాలంలో లార్డ్ లిట్టన్ ప్రాంతీయ భాష చట్టంను తీసుకొచ్చాడు.

దీని ప్రకారం పత్రికలు కేవలం ఇంగ్లీషులోనే ముద్రించాలని పేర్కొన్నారు.

దీనిని లార్డ్ రిప్పన్ రద్దు చేశాడు.

ఇండియాలో పత్రికా స్వేచ్ఛను చార్లెస్ మెట్‌కాఫ్ కల్పించాడు.

మెట్‌కాఫ్‌ను పత్రికా స్వేచ్ఛ పితగా పేర్కొంటారు.

సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ:

ఆయుధాలు లేకుండా సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛను ఆర్టికల్ 19 (1 బి) కల్పిస్తుంది.

ప్రజా భద్రత, దేశ భద్రత దృష్ట్యా పరిమితులు విధించవచ్చు.

సంఘాలు.. సంస్థలు స్థాపించుకునే స్వేచ్ఛ:

19(1 సి)లో భాగంగా 97 వ సవరణ చట్టం ద్వారా సహకార సంస్థలు చేర్చారు.

ఈ నిబంధన ప్రకారమే రాజకీయ పార్టీలు స్థాపించుకునే హక్కు ఉంది.

ఈ ఆర్టికల్ రాజకీయ న్యాయంను అందిస్తుంది.

పరిమితులు: ఉగ్రవాదులు, పోలీసులు, సైనికులు సంఘాలు ఏర్పాటు చేసుకునే వీలు లేదు.

సంచార స్వేచ్ఛ:

19 (1 డి) సంచార స్వేచ్ఛను కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా సంచారం చేయవచ్చు.

పరిమితులు: ఆదివాసీ ప్రాంతాలు, తెలంగాణలోని 1/70 యాక్ట్ చట్టం కింద గుర్తించిన ప్రాంతాలలో ఇది వర్తించదు.

ఆర్టికల్ 20:

శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు.

20 (1): అమలులో ఉన్న చట్టాల నుంచే శిక్ష వేయాలి.

20 (2): ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే వేయాలి.

కానీ రెండు నేరాలకు రెండు శిక్షలు విధించవచ్చు.

20 (3): బలవంతపు సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేయరాదు.

ఆర్టికల్ 21: చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి హాని తలపెట్టరాదు.

ఇది పరోక్షంగా జీవించే హక్కును పేర్కొంటుంది.

21(ఎ) విద్యా హక్కు:

86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002లో దీనిని చేర్చారు.

6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా నిర్భంద విద్యను కల్పించాలి.

ప్రభుత్వం 2010 ఏప్రిల్ 1న రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం తీసుకొచ్చింది.

ఆర్టికల్- 22: అక్రమ అరెస్టుల నివారణ

అరెస్టుకు గల కారణాలు తెలియజేయాలి.

అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు కోర్టులో హాజరు పరచాలి.

ఆర్టికల్- 23: వెట్టి చాకిరీ నిషేధం:

వెట్టి చాకిరి నిషేదానికి ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొచ్చింది.

1976 - పౌర హక్కుల చట్టం

1948 - కనీస వేతనాల చట్టం

ఆర్టికల్- 24:

14 ఏళ్ల లోపు గల పిల్లలను ఫ్యాక్టరీ, గనులలో ప్రమాదకర పనులు చేయించరాదు.

ప్రభుత్వం 1986 బాల కార్మిక నిషేధ చట్టం చేసింది.

2007లో బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు.

తెలంగాణ దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో బాల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

1948 ఫ్యాక్టరీల చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు పనిచేసే బాలలు బాలకార్మికులు.

బాలకార్మిక దినం: జూన్ 12 జరుపుతారు.

ప్రపంచ బాలల హక్కుల దినం - జూన్ 1.

జాతీయ బాలల హక్కుల దినం - నవంబర్ 14

జాతీయ బాలల సంరక్షణ దినం - నవంబర్ 7

మత స్వాతంత్రపు హక్కు(25 నుంచి 28):

ఆర్టికల్ 25: మత స్వేచ్ఛ

ఆర్టికల్ 26: మత ధర్మాదాయక సంస్థలు

ఆర్టికల్ 27: మత ప్రచారం కోసం పన్నులు విధించరాదు.

ఆర్టికల్ 28: విద్యాలయాల్లో మతబోధ చేయరాదు.

మత స్వేచ్ఛ (ఆర్టికల్ 25):

ప్రతి పౌరుడు ఇష్టం వచ్చిన మతం స్వీకరించవచ్చు. ఆచరించవచ్చు. అభివృద్ధి చేసుకోవచ్చు.

మత ప్రచారం చేయవచ్చు కానీ బలవంతపు మత మార్పిడి చేయరాదు.

ఆర్టికల్ 26: మత ధార్మిక సంస్థలు స్థాపించవచ్చు.

ఈ ధార్మిక సంస్థలు స్థిర, చర ఆస్తులు కలిగి ఉండవచ్చు.

ఆర్టికల్ 27: మత వ్యాప్తి కోసం పన్నులు విధించరాదు.

మత వ్యాప్తి కోసం పన్నులు విధించరాదు కానీ ఫీజులు వసూలు చేయవచ్చు.

ఆర్టికల్ 28:

విద్యాలయాల్లో మత బోధ చేయరాదు.

కొన్ని మత సంబంధ విద్యా సంస్థల్లో వారి మత అంశాలు బోధించవచ్చు.

కాని వాటిని పాలించాలని విద్యార్థులపై ఇబ్బంది పెట్టరాదు.

విద్యా సంస్కృతిక హక్కు:

ఆర్టికల్- 29: అన్ని వర్గాల వారు ముఖ్యంగా మైనార్టీలు

తమ భాష, లిపి, సంస్కృతిని రక్షించుకోవచ్చు.

ఆర్టికల్ -30: మైనారిటీ వర్గాలు భాష లిపి సంస్కృతిని రక్షించుకోవడానికి విద్యాలయాలు స్థాపించుకోవచ్చు.

మైనార్టీ: రాజ్యాంగంలో మైనారిటీ అనే పదం ఎక్కడా పేర్కొనలేదు.

రాజ్యాంగ పరిహార హక్కు (ఆర్టికల్ - 32):

ఈ హక్కును బి.ఆర్ అంబేద్కర్.. రాజ్యాంగానికి ఆత్మ/హృదయం వంటిది అని తెలిపారు.

ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు.. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు రిట్లు జారీ చేస్తాయి.

రిట్ అనగా ఆదేశం లేదా ఆజ్ఞ అని అర్థం.

ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు/హైకోర్టు 5 రకాల రిట్లను జారీ చేస్తాయి. అవి

1. హెబియస్ కార్పస్: అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలి కోర్టు ఆజ్ఞ.

2. మాండమస్: ఎవరైన ఒక అధికారి తన విధులు నిర్వర్తించనప్పుడు.. తన విధులను నిర్వర్తించాలని జారీ చేసే ఆజ్ఞ.

3. కోవారెంట్: ఎవరైన ఒక అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడితే లేదా తనకు లేని అధికారాలు చెలాయించితే ఈ రిట్ జారీ చేస్తారు.

4. ప్రొహిబిషన్: తనకు అధికారం లేని కేసును ఏదైనా కోర్టు స్వీకరించినప్పుడు పై స్థాయి కోర్టు కింది స్థాయి కోర్టుకు జారీ చేసే రిట్.

5. సెర్షియోరరి: ఒక కేసును పై స్థాయి కోర్టు కింది స్థాయి కోర్టుకు జారీ చేస్తుంది. తనకు బదిలీ చేయమని లేదా ఇతర కోర్టుకు బదిలీ చేయాలని రిట్ జారీ చేస్తుంది.


Next Story

Most Viewed