ఇండియన్ పాలిటీ: ప్రధాని.. మంత్రిమండలి

by Disha Web Desk 17 |
ఇండియన్ పాలిటీ: ప్రధాని.. మంత్రిమండలి
X

భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అమలులో ఉంది.

పార్లమెంటరీ తరహా విధానంలో రెండు రకాల అదిపతులు ఉంటారు.

1. రాష్ట్రపతి 2. ప్రధాని

రాష్ట్రపతి రాజ్యాంగాధి నేత.. ప్రధాని ప్రభుత్వాధినేత.

రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు ఉంటాయి.

ప్రధానికి వాస్తవ అధికారాలు ఉంటాయి.

దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది.

రాష్ట్రపతి దేశంలో మొట్ట మొదటి కార్యనిర్వాహకుడు .

రాష్ట్రపతి కార్యనిర్వహణ చేయడానికి ప్రధాని, మంత్రి మండలి సలహాలు అందిస్తారు.

44వ సవరణ 1978 ప్రకారం మంత్రి మండలి సలహాను రాష్ట్రపతి పాటించవచ్చు పాటించకపోవచ్చు. అయితే అదే సలహాను రెండోసారి ఇస్తే రాష్ట్రపతి తప్పక పాటించాలి.

లోక్ సభలో మెజారిటీ పార్టీ కూటమి నాయకుడిని రాష్ట్రపతి ప్రధాన మంత్రిగా నియామకం చేస్తారు.

ప్రధానిని, ప్రధాని సలహాపై మంత్రులను రాష్ట్రపతి నియామకం చేస్తారు.

సభలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు రాష్ట్రపతి దృష్టిలో ఎవరైతే పూర్తికాలం సుస్థిర ప్రభుత్వాన్ని నడపగలరో అతనిని ప్రధాన మంత్రిగా రాష్ట్రపతి నియమిస్తాడు.

ఒక వ్యక్తిని పార్లమెంట్‌లోని ఉభయ సభలలో అనగా లోక్‌సభ లేదా రాజ్యసభ నుండి ప్రధానిగా నియమించవచ్చు.

ఏ సభలో సభ్యత్వం లేకున్నా ప్రధానిగా నియమించవచ్చు. కానీ ఆరు నెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యత్వం సాధించాలి.

ఆరు నెలల్లోగా సభ్యత్వం పొందలేకపోతే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి.

ప్రధానికి ఏ సభలో సభ్యత్వం ఉన్నా అతను లోక్‌సభలో విశ్వాసం పొందాలి.

రాజ్యసభ నుంచి ఎన్నికయిన ప్రధానులు:

1. ఇందిరాగాంధీ 2. ఐ కె గుజ్రాల్ 3. మన్మోహన్ సింగ్ 4. దేవెగౌడ

పై నలుగురు లోక్‌సభలో విశ్వాసం పొందారు.

లోక్ సభలో మెజార్టీ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం లోక్‌సభకు సమిష్టి బాధ్యత వహించాలి.

మంత్రులు సమిష్టిగా లోక్‌సభకు బాధ్యత వహించాలి. వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి.

ప్రధాని, మంత్రిమండలిని నియమించేది రాష్ట్రపతి కనుక వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి.

ప్రమాణ స్వీకారం:

ప్రధాని, మంత్రిమండలిని రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.

ప్రధాని విధులు:

ప్రధాన మంత్రి మండలికి అధ్యక్షుడు

ప్రభుత్వాధినేతగా పనిచేస్తారు.

మంత్రి మండలికి, రాష్ట్రపతికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

అధ్యక్షత వహించేది..?

ప్రణాళిక సంఘం

నీతి ఆయోగ్

జాతీయ అభివృద్ధి మండలి

జాతీయ సమైక్యత మండలి

జాతీయ భద్రతా మండలి

NDMA జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ

అంతరాష్ట్ర కౌన్సిల్‌కు అధ్యక్షత వహిస్తారు

రాజీనామా:

ప్రధాని, మంత్రి మండలి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు.

ప్రధాని రాజీనామా చేస్తే మంత్రి మండలి మొత్తం రాజీనామా చేసినట్లే.. అనగా ప్రభుత్వం పడిపోతుంది.

సాధారణంగా ప్రధాని రాష్ట్రపతికి సభ రద్దు చేయాలని సలహా ఇచ్చి తాను రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్తాడు.

తొలగింపు:

లోక్‌సభలో విశ్వాస పరీక్ష ఓడినా..

లోక్ సభలో అవిశ్వాసం నెగ్గితే

లోక్‌సభలో ప్రభుత్వ బిల్లులు ఓడిపోయినప్పుడు.

ప్రైవేటు బిల్లు సభలో నెగ్గినప్పుడు

బడ్జెట్‌లో కోత తీర్మానం నెగ్గినప్పుడు

రాష్ట్రపతి విశ్వాసం కోల్పోతే.. ప్రధాని రాజీనామా చేయాలి.

మంత్రి మండలి:

మంత్రిమండలి వర్గీకరణ రాజ్యాంగంలో లేదు అనగా రాజ్యాంగ రీత్యా మంత్రి మండలిలో సభ్యులందరూ సమానమే..

కానీ నెహ్రూ ప్రభుత్వం మంత్రి మండలి వర్గీకరణపై గోపాలస్వామి అయ్యంగార్ కమిటీని నియమించింది.

ఈ కమిటీ మంత్రి మండలిని మూడు రకాలుగా వర్గీకరించింది.

1. క్యాబినెట్ మంత్రులు - పెద్ద శాఖలు నిర్వహణ

2. స్టేట్ మంత్రులు (రాజ్య) - చిన్న శాఖలు నిర్వహణ

3. డిప్యూటీ మంత్రులు (సహాయ) - సహాయ మంత్రులు

మంత్రి మండలి సభ్యుల సంఖ్య:

91వ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్‌సభలోని సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించి ఉండరాదు.

READ MORE

NCLలో 405 మైనింగ్, సర్వేయర్ పోస్టులు



Next Story

Most Viewed