ఇండియన్ పాలిటీ: ఆదేశిక సూత్రాలు

by Disha Web Desk 17 |
ఇండియన్ పాలిటీ: ఆదేశిక సూత్రాలు
X

రాజ్య విధాన ఆదేశ సూత్రాలు (ఆర్టికల్ 36 - 51):

రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు పొందుపరచబడ్డాయి.

వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.

ఆదేశిక సూత్రాలను 1935లో ఉన్న సూచన పత్రం గా పేర్కొంటారు.

వీటిని అంబేద్కర్ ఇన్‌స్ట్రూ‌మెంట్స్ ఆఫ్ ఇన్‌స్ట్ర‌క్షన్స్‌గా పేర్కొన్నాడు.

అనగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అని అర్థం.

ఆర్టికల్ 36: రాజ్య నిర్వచనం

ఆర్టికల్ 37: వీటికి న్యాయ సంరక్షణ లేదు, వీటిని ప్రభుత్వాలు మార్గదర్శకాలుగా పాటించాలి.

ఆర్టికల్ 38 నుంచి 51 నిబంధనలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి

1. ఉదారవాద నియమాలు (44,49,50,51)

2. గాంధేయవాద నియమాలు (40,43,47,48)

3. సామ్యవాద నియమాలు (38,39,41,42, 43,46)

ఉదారవాద నియమాలు:

ఆర్టికల్ 44: ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్)

ఉమ్మడి పౌర స్మృతి అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం - గోవా.

ఆర్టికల్ 49: ప్రాచీన వాస్తు శిల్ప సంపదను రక్షించాలి.

ఆర్టికల్ 50: కార్యనిర్వహక శాఖ నుంచి న్యాయవ్యవస్థను వేరు చేయాలి.

ఆర్టికల్ 51: అంతర్జాతీయ శాంతిని పెంపొందించాలి.

నోట్: ఇది భారతీయ విదేశాంగ విధానాన్ని తెలుపుతుంది.

1954లో పంచశీల ఒప్పందం.. ఇండియా - చైనా (నెహ్రూ-చౌ ఎన్ లై) మధ్య జరిగింది.

గాంధీ నియమాలు:

ఆర్టికల్ 40 : గ్రామ పంచాయితీల ఏర్పాటు.

భారత దేశం 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

పంచాయతీరాజ్ వ్యవస్థలో 29 అంశాలు ఉన్నాయి.

గాంధీ గ్రామ స్వరాజ్యం రావాలని కాక్షించాడు.

ఆర్టికల్ 43: వ్యక్తి పరంగా లేదా సామాజిక పరంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.

ఉదా: ఖాదీ బోర్డు ఏర్పాటు.

ఆర్టికల్ 47: ప్రజలని ఆరోగ్యంగా ఉంచడంలో భాగంగా మత్తు పదార్థాలు, మద్యపాన నిషేధం.

ఉదా: మొరార్జీ దేశాయి ప్రభుత్వం మద్యపానం నిషేదించింది.

ఇండియాలో తొలిసారిగా మద్యపానం పూర్తిగా నిషేధించిన రాష్ట్రం - కేరళ.

ప్రస్తుతం మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రం - బీహార్.

ఆర్టికల్ 48: పాడి పశువుల అభివృద్ధి, గోవధ నిషేధం.

పెంపుడు, అడవి జంతువుల రక్షణ.

సామ్యవాద నియమాలు:

సమసమాజ స్థాపన.

ఆర్టికల్ 38: వెల్ఫేర్ స్టేట్.

ప్రజలందరికి ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం అందించాలి. (సంక్షేమ రాజ్యం)

నోట్: ప్రాథమిక హక్కులు కేవలం రాజకీయ హక్కును కల్పిస్తాయి.

ఆర్టికల్ 39: ప్రభుత్వం ఈ కిందివి పాటించాలి.

39(ఎ): ఉచిత న్యాయం అందించాలి

39(బి): దేశ సంపద, సహజ వనరులు ప్రజలందరికి పంచాలి.

39 (సి): దేశ సంపద, సహజ వనరులు ఏ ఒక్కరి వద్ద కేంద్రీకృతం కాకూడదు. వికేంద్రీకరణ జరగాలి.

ఆర్టికల్ 41: జీవనోపాధి కల్పించాలి (పని చేయగలిగిన వారికి పని హక్కు కల్పించాలి)

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలి.

చదువుకునే వారికి విద్య హక్కు.. కల్పించాలి.

ఆర్టికల్ 42: మహిళలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి.

కార్మికులకు హేతుబద్దమైన పని గంటలు, పనిచేసే వాతావరణం కల్పించాలి.

కార్మికులకు 8 గంటల పని కల్పించాలి.

ఆర్టికల్ 43:

ఆర్టికల్ 43 (ఎ): కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించాలి.

ఆర్టికల్ 43(బి): సహకార సంస్థలు స్థాపించాలి.

ఆర్టికల్ 45:

6 ఏళ్ల లోపు పిల్లలకు విద్య అందించాలి.

21(ఎ): 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్భంద విద్య అందించాలి.

51(ఎ): 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యను అందించడం తల్లిదండ్రుల విధి.

ఆర్టికల్ 45: 6 ఏళ్ల లోపు పిల్లలకు విద్య.

ఆర్టికల్ 46: సామాజిక పరంగా, విద్య పరంగా వెనుకబడిన వారికి ప్రత్యేక మినహాయింపు కల్పించాలి.

ఇతర భాగాలలో ఉన్న ఆదేశిక సూత్రాలు:

335 ఆర్టికల్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు

350 ఎ: మాతృభాషలో విద్యా బోధన.

ఆర్టికల్ 351: జాతీయ భాషగా హిందీ.

ఆదేశిక సూత్రాల లక్షణాలు:

సంక్షేమ రాజ్య స్థాపన

శ్రేయోరాజ్య స్థాపన

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం

ప్రభుత్వానికి చట్టాలు రూపొందించడంలో సలహాలు

ప్రభుత్వాలకు మార్గదర్శకాలు

మానవత్వం కలిగి ఉంటాయి.

నేరుగా అమల్లోకి రావు కాబట్టి ప్రభుత్వాలు చట్టాలు చేయాలి.

న్యాయ సంరక్షణ లేనివి (39 బి, 39 సి)

ప్రాథమిక విధులు:

ప్రాథమిక విధులు రాజ్యాంగ ప్రారంభంలో లేవు.

ప్రజాస్వామ్య దేశాలలో పౌరులకు విధులు ఉండవు.

నియంత రాజ్యాలలో పౌరులకు విధులు ఉంటాయి.

భారత రాజ్యాంగం ప్రాథమిక విధులను యూఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి గ్రహించింది.

స్వరణ్ సింగ్ కమిటీ:

స్వరణ్ సింగ్ 13 ప్రాథమిక విధులను సిఫార్సు చేసింది.

అందులో నుంచి 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగం తీసుకుంది.

ఈ పదింటిని 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ సవరణ చేసి రాజ్యాంగంలో చేర్చింది.

ప్రాథమిక విధులు:

1. జాతీయ జెండా, జాతీయ గీతం, భారత రాజ్యాంగంను గౌరవించాలి.

2. దేశ రక్షణకు పాటు పడాలి.

3. సోదర భావం పెంపొందించుకోవాలి. (పౌరుల పట్ల సోదర భావం కలిగి ఉండాలి)

4. ఇంటెగ్రిటీ - సమైక్యత సమగ్రత కాపాడాలి.

5. భారతదేశ సార్వభౌమత్వంను కాపాడాలి.

6. పర్యావరణంను కాపాడాలి.. వన్యమృగ సంరక్షణ చేయాలి.

7. దేశ సంపదను రక్షించాలి.

8. శాస్త్రీయ దృక్పథం ఉండాలి..మూఢనమ్మకాలు పారద్రోలాలి.

9. ఉమ్మడి సంస్కృతిని కాపాడాలి.

చారిత్రక ప్రాచీన కట్టడాలు రక్షించాలి.

10. వ్యక్తిగతంగా ఔన్నత్యంను చేరుకోవాలి.

నోట్: 86వ రాజ్యాంగ సవరణ 2002లో 11వ విధిని చేర్చారు.

11. 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు నిర్భంద విద్య అందించడం తల్లిదండ్రుల, సంరక్షకుల విధి.

లక్షణాలు: ఇవి పౌరులకు నిర్దేశించినవి

న్యాయ సంరక్షణ లేనివి.

వీటిని అమలు చేయాలని కోర్టుకు పోలేము.

విధులను పాటించాలని కోర్టుకు పోయే వీలు లేదు. కాని వాటిని దిక్కరిస్తే శిక్షకు అర్హులవుతారు.

రాజ్యాంగంలోని ఇతర భాగాల్లో గల హక్కులు:

ఆస్తి హక్కు:

1978లో 44వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో నుంచి తొలగించి 12వ భాగంలో 300(ఎ) ఆర్టికల్ లో చట్టబద్దమైన హక్కుగా లేదా న్యాయబద్ధమైన హక్కుగా చేర్చారు.

ఓటు హక్కు:

ప్రస్తుత ఓటు హక్కు వయసు - 18 సంవత్సరాలు.

61 వ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయసు 21 నుంచి 18 కి కుదించారు.

రాజకీయ హక్కు:

ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం

ప్రభుత్వం ఏర్పాటు చేయడం

ప్రభుత్వంను నిర్మాణాత్మకంగా విమర్శ చేయడం.

నైతిక హక్కులు:

వృద్దాప్యంలో పెద్దలను పోషించడం.

వృద్దులను, వికలాంగులను రోడ్డు దాటించడం.

పెద్దలను గౌరవించడం.


Next Story

Most Viewed