తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు

by Disha Web Desk 17 |
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు
X

మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు:

పూర్తయిన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు

నాగార్జున సాగర్, శ్రీరామ సాగర్ స్టేజి 1(పోచంపాడు), నిజాంసాగర్, ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఆరుగుల రాజారాం గుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ప్రియదర్శిని జూరాల, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, కడ్డం నారాయణ రెడ్డి, మూసి.

ఆన్ గోయింగ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు

ఎలిమినేటి మాధవరెడ్డి (ఎస్‌ఎల్‌బిసి), శ్రీరామ సాగర్ స్టేజ్ 2, జె.పి.ఆర్ గోదావరి లిఫ్ట్, మహాత్మాగాంధీ కల్వకుర్తి , రాజీవ్ భీమా , జవహర్ నెట్టెంపాడు, పెద్దవాగు (శ్రీ కొమురం భీం) ప్రాజెక్టు, కోయిల్‌సాగర్ , సింగూరు, శ్రీపాద ఎల్లంపల్లి, ఇందిరమ్మ ఎఫ్‌ఎఫ్‌సి ఫ్రమ్ ఎస్‌ఆర్‌ఎస్‌పి, సీతారామ, భక్తరామదాసు, బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, దిండి, లోవర్ పెన్‌గంగ, పి.వి నరసింహారావు (కాంతనపల్లి), చనాఖా కొరాట బ్యారేజ్, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తుమిళ్ల, లెండి ప్రాజెక్టు.

9 పూర్తి చేసిన మేజర్ ప్రాజెక్టుల ద్వారా 21.32 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్‌ను పూర్తి చేయడం జరిగింది.

అతిపెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన శ్రీరామసాగర్ స్టేజ్ 1 ద్వారా 9.68 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్‌ను అందిస్తున్నారు.

దీని తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా 6.40 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్‌ను అందిస్తున్నారు.

రాష్ట్రంలో 24 ఆన్ గోయింగ్ మేజర్ ప్రాజెక్టుల ద్వారా 69.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటి వరకు 17.85 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్‌కు స్టాండ్ క్రియేట్ చేయడం జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్ ఆయకట్టు గురించి ప్రయత్నం జరుగుతుంది.

18.82 లక్షల స్టెబిలైజేషన్ చేస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఆన్‌గోయింగ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం.

ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌ఎస్‌పి 1,2 ద్వారా 13.20 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ చేయడం జరిగింది.

0.88 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్ స్టాండ్‌ను క్రియేట్ చేయడం జరిగింది.

మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు

పూర్తయిన మీడియం ప్రాజెక్టులు

3.04 లక్షల ఎకరాల ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ పొటెన్షియల్‌తో 27 ప్రాజెక్టులు ఉన్నాయి.

ఆసిఫ్ నహర్, దిండి, నల్లవాగు, ఘన్‌పూర్ ఆనకట్ట, రామడుగు, పోచారం, కౌలాస్‌నాలా, సత్నాలా, స్వర్ణ, వట్టెవాగు, చెల్మెలవాగు (ఎన్‌టిఆర్ సాగర్), పి.పి రాపు (యర్రవాగు), అప్పర్ మానేరు, శనిగరం, బొగ్గుల వాగు, మల్లురు వాగు, లక్నవరం లేక్, రామప్ప లేక్, పాకాల లేక్, వైరా, లంకసాగర్, తలిపేరు, బయ్యారం చెరువు, గుండ్లవాగు, పెద్దవాగు, గడ్డెనవాగు (సుద్ధ వాగు), కోటేపల్లి వాగు.

ఆన్‌గోయింగ్ మీడియం ప్రాజెక్టులు

రాలివాగు, గొల్లవాగు, మత్తడివాగు, కిన్నెరసాని, పాలెం వాగు, చైటుపల్లి హనుమంతరెడ్డి, పెద్దవాగు (నిల్వా యి), సదర్‌మట్ బ్యారేజ్, మోడికుంటవాగు, పెద్దవాగు జగన్నాధపూర్.

మైనర్ ఇరిగేషన్:

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మైనర్ ఇరిగేషన్ సోర్సెస్ 46,531.

మైనర్ ఇరిగేషన్ సోర్సస్‌లో చెరువులు, ఇతర రకాల చెరువులు ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక చెరువులు గల జిల్లా సిద్ధిపేట (3,256).

తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప చెరువులు గల జిల్లా మేడ్చల్ మల్కాజ్‌గిరి (489)

అత్యధిక చెరువులు గల జిల్లాలు:

సిద్ధిపేట : 3,256

మెదక్ : 3,054

సంగారెడ్డి : 2,918

భద్రాద్రి : 2,855

నల్గొండ : 2367

అత్యల్ప చెరువులు జిల్లాలు

మేడ్చల్ : 489

కుమురంభీం : 576

గద్వాల : 589

ఆదిలాబాద్ : 649

రాజన్న సిరిసిల్ల : 666

- పృథ్వీ కుమార్ చౌహాన్, పృథ్వీ ఐఏఎస్ స్టడీ సర్కిల్.


Next Story

Most Viewed