ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పుట్టినరోజు వేడుకలు

by Sridhar Babu |

<p>దిశ, ములకలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థుల పుట్టిన రోజు వేడుకలను పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుతున్నారు. పాఠశాల అభివృద్ధికి ఎన్నో నిధులు విరాళంగా ఇచ్చిన రిటైర్ ఉద్యోగి జలగం లీలా సంతోష్ కుమార్ ప్రోత్సాహం, ఆర్థిక వెసులుబాటుతో తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న సుమారు 80 మంది విద్యార్థుల పుట్టినరోజును ఘనంగా నిర్వహించడం గత రెండు సంవత్సరాలుగా సాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం [&hellip;]</p>

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పుట్టినరోజు వేడుకలు
X

దిశ, ములకలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థుల పుట్టిన రోజు వేడుకలను పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుతున్నారు. పాఠశాల అభివృద్ధికి ఎన్నో నిధులు విరాళంగా ఇచ్చిన రిటైర్ ఉద్యోగి జలగం లీలా సంతోష్ కుమార్ ప్రోత్సాహం, ఆర్థిక వెసులుబాటుతో తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న సుమారు 80 మంది విద్యార్థుల పుట్టినరోజును ఘనంగా నిర్వహించడం గత రెండు సంవత్సరాలుగా సాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శంకర్ రాథోడ్ తెలిపారు.

శనివారం ఇదే పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న పోతుగంటి పినకిని అనే విద్యార్థి పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా జరిపారు. జలగం లీల సంతోషం కుమార్ పుట్టిన రోజు వేడుకలకు కొంత నిధిని కేటాయించారు. ఈ నిధితో కేక్, రకరకాల పండ్లు, బిస్కెట్స్, చాక్లెట్ వంటివి పంచి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శంకర్, శ్రీనివాస్, ధనలక్ష్మి, మూతేశ్వరవు పాల్గొన్నారు.

Next Story