అక్కడ మొగుడు కావాలంటే పాములు పట్టాల్సిందే..

by  |
strange custome in madyapradesh
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది.. త్వరగా పెళ్లి చేయాలి.. కానీ కట్నం ఎలా..? వెంటనే అడవికి వెళ్లాలి.. ఎలా అయినా 21 విష సర్పాలను పట్టుకోవాలి. లేకపోతె పెళ్లి ఆగిపోతుంది. అల్లుడు గారికి ఎలాంటి మర్యాదలు తగ్గకూడదు. వీలయితే ఇంకో పామును ఎక్కువ ఇవ్వాలే కానీ తక్కువ చేయకూడదు అని అనుకుంటూ పాముల వేటకు బయల్దేరింది ఆ కుటుంబం. అసలు ఈ పెళ్లి ఏంటి..? పాములేంటి..? కట్నంగా పాములను ఇవ్వడమేంటి..? అనేగా డౌట్. అన్నింటికీ సమాధానాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

భారతదేశం వసుధైక కుటుంబం.. ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్న మన దేశంలో ఎన్నో వింత ఆచారాలు కూడా ఉన్నాయి. కొన్ని తెగల్లో ఆ ఆచారాలు విన్నా, చూసినా ఒళ్లు గగుర్పుడవడం ఖాయం. తాజాగా ఒక జాతి తెగలో కట్నంగా పాములను ఇస్తారంట.. అందులోనూ మాములు పాములు కూడా కాదు విష సర్పాలనే కట్నం కింద అప్పజెప్పుతారట. మధ్యప్రదేశ్‌లోని గొరియా తెగ ప్రజలు పాములు పట్టి జీవనం సాగిస్తారు. అక్కడ పెళ్లిళ్లు కూడా చాలా వింతగా జరుగుతాయి. అమ్మాయి, అబ్బాయికి పెళ్లి నిశ్చయమయ్యాక వరుడికి కట్నం కింద వధువు తల్లిదండ్రులు 21 విషసర్పాలను ఇవ్వాలి.

పెళ్లిలో కట్నంగా నగదు, వస్తువులకు బదులుగా బతికున్న విషసర్పాలను వరుడికి అందజేయాలనేది వీరి ఆచారం. పెళ్లి కుదరగానే వధువు కుటుంబసభ్యులంతా పాముల వేట మొదలు పెడతారట. పెళ్లినాటికి లెక్క ప్రకారం సరిపడ పాములను అందజేయాల్సిందే. పాములు పట్టాకనే పెళ్లి జరుగుతుంది. ఒక్క పాము తగ్గినా కట్నం తగ్గిందని గొడవలు కూడా జరుగుతాయి. ఇక ఆ కట్నం కింద వచ్చిన సర్పాలను ఎంతో అపురూపంగా చూసుకొంటారట. వారికి విష సర్పాలతో ఆడుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి చిటికెలో పాములను మచ్చిక చేసుకుంటారు. అక్కడ ఆచారం ఏమో కానీ ఈ ఆచారం వింటున్నా వెన్నులో వణుకు పుడుతుంది కదా..

Next Story