విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి

by Aamani |
విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి
X

దిశ, చిట్యాల: విద్యుత్ షాక్ తగిలి మండలంలోని వెంకట్రావుపల్లి (సి) గ్రామంలో ని మూడతన పెల్లి లక్ష్మి, దుంప సాయి చరణ్ మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కాలంలో లక్ష్మీ భర్త చనిపోవడం చేత కొన్ని రోజులు ఉండటానికి తన పెద్ద బిడ్డ పిడిసిల్ల గ్రామానికి తీసుకపోగా అక్కడ సోమవారం ఉదయం బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలిన లక్ష్మి లక్ష్మి నీ కాపాడబోయిన మనవడు సాయి చరణ్ కూడా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. గ్రామంలో ఉదయం పూట అందరూ కరువు పనికి పోవడం వల్ల చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారిని పోలీస్ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed