సివిల్ సప్లై అధికారుల ఉక్కుపాదం..

by Aamani |
సివిల్ సప్లై అధికారుల ఉక్కుపాదం..
X

దిశ,అమరచింత: అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారులు సిద్ధమయ్యారు.ఆత్మకూర్ మండల కేంద్రంలోని కొండ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు యజమాని కృష్ణయ్య పై సోమవారం క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సివిల్ సప్లై అధికారులు సిద్ధమయ్యారు. కొండ ఇండస్ట్రీస్ యజమానికి 2021-22 లో ఖరీఫ్,రబీ సీజన్ కి సంబంధించి సీఎంఆర్ రైస్ కోసం ధాన్యాన్ని అందజేశామని సివిల్ సప్లై డీటీ వేణు తెలిపారు.కానీ మిల్లు యజమాని కృషయ్య 33 వేల 925 బస్తాల ధాన్యానికి సంబంధించిన రైస్ సివిల్ సప్లైకి ఇవ్వవలసి ఉండగా,మిల్లు తాళం వేసి పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

నోటీసులు ఇచ్చేందుకు తాము ఎంత ప్రయత్నించినా కృష్ణయ్య అందుబాటులోకి రావడం లేదన్నారు. సోమవారం సివిల్ సప్లై జిల్లా అధికారులు రైస్ మిల్లు వద్దకు చేరుకుని పంచనామా నిర్వహించి,కృష్ణయ్య పై 6ఏ కేసు నమోదు చేశారు. అనంతరం క్రిమినల్ కేసు,రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డీఎం కార్యాలయం అసిస్టెంట్ మేనేజర్ బాలు వెల్లడించారు. జిల్లాలో 75 మంది రైస్ మిల్లర్లు రూ.375 కోట్ల వరకు, రైస్ సివిల్ సప్లైకి బకాయి ఉన్నారని,చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డీటీ నందకిషోర్,ఇన్స్పెక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story