మంచినీరు వృధా.. ఫిర్యాదు చేసిన పట్టించుకోని జలమండలి అధికారులు

by Aamani |
మంచినీరు వృధా.. ఫిర్యాదు చేసిన పట్టించుకోని జలమండలి అధికారులు
X

దిశ,ఉప్పల్: చిల్కానగర్ బొడ్రాయి దగ్గర విజ్ఞాన్ గ్రామర్ స్కూల్ గల్లీలో మంచినీళ్ల పైపు లైన్ వాల్ లీకేజీ అయి గత 20 రోజులు గడుస్తున్నా కూడా స్పందించని జలమండలి అధికారులు. కాలనీవాసులు మంచినీరు రోడ్డుపై వృధాగా పోతున్నాయని వాటర్ డిపార్ట్మెంట్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది.అయినా కూడా సమస్యను పరిష్కరించడంలో జాప్యం జరుగుతుంది. రోడ్డుపై మంచినీరు వృధాగా పోవడం వల్ల రోడ్డు డ్యామేజ్ ఇతర సమస్యలు రావడం జరుగుతుందని వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు త్వరగా స్పందించి మంచినీరు రోడ్డుపై వృధాగా పోకుండా సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Next Story