‘ప్యాకేజీతో ఒనగూరిందేం లేదు’

by  |
‘ప్యాకేజీతో ఒనగూరిందేం లేదు’
X

దిశ, సెంట్రల్ డెస్క్: కేంద్రం ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో ఒనగూరేదేమీ లేదని ఆర్థిక, మార్కెట్ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ ప్యాకేజీ వల్ల మార్కెట్లలో షేర్లు పేకమేడల్లా కుప్పకూలడమే దీనికి నిదర్శనమన్నారు. కరోనా సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఈ ప్యాకేజీ ఎంతవరకూ మేలు చేస్తుందో ఇప్పుడే చెప్పలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆశించిన స్థాయిలో ప్యాకేజీ మేలు చేయనప్పుడు మరింత మాంద్యాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘ఉద్దీపన ప్యాకేజీ అనేది జీడీపీకి ఊతమివ్వాలి. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీ జీడీపీకి ఒక్క శాతం కూడా మేలు చేయదని’ ప్రముఖ ఎనలిస్ట్ స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. భారీగా ప్యాకేజీ ప్రకటించడానికి ప్రభుత్వం వెనకాడిందని, విత్త లోటును చూపించి రేటింగ్ డౌన్‌గ్రేడ్ జరుగుతుందని భయపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మాత్రానికి ఉద్దీపన ప్యాకేజీ అని చెప్పక్కరలేదన్నారు. ప్యాకేజీ ఒక రకంగా రోగికి నొప్పి తెలీకుండా ఇచ్చే మత్తుమందు లాంటిదేనని విమర్శించారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదని, లాక్‌డౌన్‌తో సరఫరా దెబ్బతిందని స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed