స్టాక్ మార్కెట్‌లో ఎలా అడుగు పెట్టాలి..?

by  |
stock market
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టాక్ మార్కెట్. ఇదొక అర్ధం కానీ, అంతుచిక్కని మాయల ప్రపంచం. ఎవర్ని ఎప్పుడు ధనవంతుణ్ణి చేస్తుందో, ఎప్పుడు బికారిగా చేస్తుందో ఎవరికీ తెలియదు. మార్కెట్‌ను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. కానీ దాని గురించి అవగతం చేసుకున్న వాళ్లు లాభాలను గడించడం చాలా సులువు. ఒకప్పుడు కొంత మందికే పరిమితమైన స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో చాలా మంది కొత్తగా అడుగు పెడుతున్నారు. దీనిపై కూడా కొత్త కొత్త యాప్స్ రావడంతో స్టాక్స్ మార్కెట్‌పై యువతకు అవగాహన పెరిగి పెట్టుబడులు పెడుతున్నారు. మరి కొంతమంది సరైన అవగాహన లేక డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

కానీ విపణిలో నిలదొక్కుకోవాలంటే ప్రతిరోజు మార్కెట్‌ను అర్ధం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థలు చాలా వరకు వచ్చాయి అందులో zerodha, angel, upstox, iifl, grow more ముఖ్యమైనవి.

కొత్తగా అకౌంట్ ఎలా తీసుకోవాలి..?

కొత్తగా చేరేవారికి డి మ్యాట్ అకౌంట్ తప్పనిసరి. ఆధార్, పాన్ ద్వారా డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మార్కెట్‌లోకి అడుగు పెట్టవచ్చు. డి మ్యాట్ అకౌంట్ అనేది మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలంటే ఒక ఎంట్రికార్డ్‌లా ఉపయోగపడుతుంది. అకౌంట్ ఓపెన్‌కు ఆధార్, పాన్ డీటేల్స్ ఇవ్వడంతో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఆధార్ మరియు పాన్ వివరాలు ఇచ్చాక వెరిఫికేషన్ కోసం రెండు నుంచి మూడు రోజుల వరకు టైం పడుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత మనం ముందే ఇచ్చిన మెయిల్, మొబైల్‌కు మెసేజ్ రూపంలో లాగిన్ఐడి వివరాలు వస్తాయి. అలా వచ్చిన వివరాలతో సంబంధిత అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి. యాప్ ఓపెన్ చేయగానే స్టాక్ మార్కెట్లో నమోదైన స్టాక్స్ కనిపిస్తాయి. మనకు కావలసిన స్టాక్స్‌ను వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని స్టాక్స్ ఎలా పెరుగుతుంది..?, ఎలా తగ్గుతుందో పరిశీలించాలి.

ఇన్వెస్ట్‌మెంట్ ఇలా చేసుకోవచ్చు

మనం కొనే స్టాక్స్, ట్రేడింగ్‌కు సంబంధించిన డబ్బులకు CDSL – సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ అనేది సెక్యూరిటీగా ఉంటుంది. మనం చేసే ప్రతి ట్రాన్సాన్క్షన్ కు సంబంధించిన డాటా పాన్ కార్డు ద్వారా income tax డిపార్ట్మెంట్‌కు చేరుతుంది. మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ సంబంధిత స్టాక్స్‌కు వెళ్తుంది. యాప్స్‌లో ఉండే మిగిలిన అమౌంట్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు withdraw చేసుకోవచ్చు. ఒక్కొక్క స్టాక్స్‌కు ఒక్కో విలువ ఉంటుంది. మనం స్టాక్స్‌ను కొనవచ్చు, అమ్మవచ్చు. అలా వచ్చిన లావాదేవీల డబ్బులను సంబంధిత యాప్ ద్వారా మన బ్యాంకు అకౌంట్‌లోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు.

అవగాహన లేకపోతే ఏం చేయాలి..?

ఇందులో ఇంట్రాడే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇన్వెస్ట్మెంట్ మొదలగునవి ఉంటాయి. స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ తో కూడుకుంది. మార్కెట్‌పై అవగాహన లేని వాళ్ళు డైరెక్ట్ గా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయకుండా mutual funds ద్వారా కూడా మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. డైరెక్ట్ ఇన్వెస్ట్ తో పోలిస్తే mutual funds అనేది కొంచం రిస్క్ తక్కువగా ఉంటుంది. మార్కెట్ పై పూర్తి అవగాహన ఉన్న వాళ్లు మాత్రం మార్కెట్‌లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయవచ్చు. మార్కెట్ సంబంధిత వార్తలను రోజూ స్టడీ చేస్తూ అర్ధం చేసుకుంటే తక్కువ కాలంలోనే మంచి లాభాలు పొందవచ్చు.

Next Story

Most Viewed