భారత జాలర్ల పై శ్రీ లంక నేవీ రాళ్ల దాడి !

by  |
fisherman
X

చెన్నై: తమిళ జాలర్లపై మరోసారి లంక నేవీ అత్యుత్యాహం ప్రదర్శించింది. హిందూమహసముద్రంలో చేపలవేటకు వెళ్లిన 60 బోట్లపై లంక నేవీ రాళ్లదాడికి పాల్పడినట్లు ఆదివారం మత్స్యశాఖ ప్రకటించింది. రాళ్లదాడికి దిగటంతో పాటు మరో 25 చేపల బోట్లకు చెందిన వలలను, ఇతర పరికరాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఆ సమయంలో జాలర్లంతా భారత్- శ్రీలంక మధ్యలో గల కచ్చదీవుల వద్ద ఉన్నారని వెల్లడించింది.

దాదాపు రెండు వెస్సెల్స్‌లో వచ్చిన శ్రీలంకన్ నేవీ దాడికి దిగినట్లు మత్స్యకారులు తెలిపారు. కాగా ఈ సంఘటనలో మత్య్సకారులెవరు గాయపడలేదని తెలుస్తోంది. శనివారం మొత్తం 556 బోట్లు సముద్రంలోకి వెళ్లగా వాటిలో కొన్నింటిపై శ్రీలంకన్ నేవీ దాడిగి దిగినట్లు మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు ఎస్. ఎమిరేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేదంటే మత్య్సకారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed