T20WorldCup2026: మరో పెద్ద జట్టును ఓడించిన జింబాబ్వే

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-19 13:20:42  IST  )

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కొలొంబో మైదానం వేదికగా శ్రీలంక - జింబాబ్వే మధ్య మ్యాచ్ జరిగింది.

T20WorldCup2026: మరో పెద్ద జట్టును ఓడించిన జింబాబ్వే
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కొలొంబో మైదానం వేదికగా శ్రీలంక - జింబాబ్వే మధ్య మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్రియాన్ (63), సికిందర్ రాజా(45), మారుమణి (34) పరుగులతో అద్భుతంగా రాణించి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో హేమంతా రెండు వికెట్లు, శనక, దునిత్ చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాథున్ నిశాంక (62) హాఫ్ సెంచరీ సాధించడంతో.. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పవన్ రత్నాయకే (44), కుశాల్ పెరీరా (22) రాణించారు. కుశాల్ మెండిస్ (14), కమిందు మెండిస్ (7), డాసున్ శనక (6) విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2, గ్రీన్‌ క్రెమెర్ 2, ఇవాన్స్ 2, బర్ల్‌ ఒక వికెట్ తీశారు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటికే శ్రీలంక, జింబాబ్వే సూపర్ -8కి చేరాయి. అయితే, గ్రూప్ స్టేజ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఇరు జట్లూ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో జింబాబ్వే జట్టు టాప్‌ స్థానంతో సూపర్ -8లో ఆడనుంది.

Next Story