రాణించిన తిల‌క్‌, ఇషాన్‌..జింబాబ్వే ముందు భారీ టార్గెట్

by velandi.Saikiran |

తిల‌క్‌, ఇషాన్ రాణించిన తరుణంలో భార‌త్ భారీ స్కోర్ సాధించింది.

రాణించిన తిల‌క్‌, ఇషాన్‌..జింబాబ్వే ముందు భారీ టార్గెట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ ఓడిపోయి, మొదట బ్యాటింగ్ చేసిన భారత్... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో వైభవ్, అభిషేక్ శర్మ పెద్దగా రాణించకపోయినా... మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అదరగొట్టారు.

ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 81 పరుగులు సాధించగా.. తిలక్ వ‌ర్మ కేవలం 29 బంతుల్లో 60 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. దీంతో భారీ స్కోరు సాధించింది భారత్. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 8 పరుగులు, రింకూ సింగ్ 12 పరుగులకు ఔటై నిరాశ పరిచారు. ఇక ఈ మ్యాచ్ లో 220 పరుగులు చేస్తే జింబాబ్వే విక్టరీ కొట్టనుంది. ఒకవేళ జింబాబ్వే ఓడితే.. టీ20 సిరీస్ భారత వ‌శం అవుతుంది.

Next Story