- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cricketer died : కార్డియక్ అరెస్ట్‌తో యువ క్రికెటర్ మృతి
కార్డియక్ అరెస్ట్‌తో క్రికెటర్ మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది.

దిశ, స్పోర్ట్స్ : కార్డియక్ అరెస్ట్‌తో క్రికెటర్ మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. ముంబాయి పూణెలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గర్వారే స్టేడియంలో జరుగుతున్న ఓ మ్యాచ్‌లో ఇమ్రాన్ పటేల్(35) ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు. అయితే కాసేపటికే ఛాతి, భుజం నొప్పిగా ఉందని అంపైర్లకు చెప్పాడు. అస్వస్థతకు గురి కావడంతో ఫీల్డ్ ఆంపైర్లు గ్రౌండ్ వదిలి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. పెవిలియన్ చేరుతుండగానే ఒక్కసారిగా ఇమ్రాన్ పటేల్ కుప్పకూలిపోయాడు. ఈ మొత్తం ఘటన లైవ్ కెమెరాకు చిక్కింది. ఇమ్రాన్ కుప్పకూలడంతో గ్రౌండ్‌లోని ఆటగాళ్లంతా ఒక్క సారిగా అతని దగ్గరికి పరుగులు తీశారు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇమ్రాన్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటంతో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉండే ఇమ్రాన్ పటేల్ మృతి చెందడంతో సహచర క్రికెటర్లు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆల్-రౌండర్‌గా మైదానంలో చురుకుగా ఉండే ఈ యువ ఆటగాడి మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






