వరల్డ్ కప్ విజయం.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రత్యేక టాటూ

by Malleboina Mahesh |

నవంబర్ 2న జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన భారత మహిళల జట్టు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది.

వరల్డ్ కప్ విజయం.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రత్యేక టాటూ
X

దిశ, వెబ్ డెస్క్: నవంబర్ 2న జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన భారత మహిళల జట్టు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. దీంతో భారత జట్టు దశాబ్దాల కల నెరవేరడంతో హర్మన్ సేనాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత జట్టుకు వరల్డ్ కప్ సాధించిన జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్ ఈ విజయాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తుంది. ఇందులో భాగంగానే.. ప్రపంచకప్‌ విజయాన్ని చిరస్మరణీయంగా నిలుపుకోవాలని భావించిన ఆమె తన చేతిపై వరల్డ్ కప్‌ ఆకారంలో టాటూ వేయించుకున్నారు. అందులో “2025” అనే సంవత్సరాన్ని కూడా ప్రత్యేక టాటూ రూపంలో వేయించుకుంది. ఈ టాటూ హర్మన్‌ప్రీత్‌ విజయసంకేతంగా మారింది. అభిమానులు సోషల్‌ మీడియాలో ఈ టాటూ ఫొటోను వైరల్‌గా మార్చుతూ, “మన కెప్టెన్‌ గర్వకారణం” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story