- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iga Swiatek : వింబుల్డన్ మహిళల విజేత స్వైటెక్
వింబుల్డన్ మహిళల సింగిల్స్ 2025(Wimbledon Women's Singles) టైటిల్ ను ఇగా స్వైటెక్(Iga Swiatek) గెలుచుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : వింబుల్డన్ మహిళల సింగిల్స్ 2025(Wimbledon Women's Singles) టైటిల్ ను ఇగా స్వైటెక్(Iga Swiatek) గెలుచుకుంది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవాను 6-0, 6-0 స్కోరుతో 57 నిమిషాల్లో ఓడించి స్వైటెక్ మొదటి వింబుల్డన్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్‌లో ఒక్క సెట్ కూడా గెలవని తొలి క్రీడాకారిణిగా అనిసిమోవాను పరాభవాన్ని మూటగట్టుకుంది. వింబుల్డన్ లో ఇలా జరగడం 1911 తర్వాత ఇది రెండవసారి. 24 ఏళ్ల స్వైటెక్ ఖాతాలోఇది ఆరవ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించింది.
ఇందులో నాలుగు ఫ్రెంచ్ ఓపెన్, ఒక యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. మ్యాచ్ తర్వాత అనిసిమోవాను ఓదార్చిన స్వైటెక్.. ఆమె గొప్ప టోర్నమెంట్ ఆడినందుకు అభినందించింది. అనిసిమోవా తన మొదటి గ్రాండ్ స్లామ్ గెలవలేక పోయినందుకు కన్నీళ్లు పెట్టుకుని,స్వైటెక్ ను ప్రశంసించింది.






