WTC: ఆరో స్థానానికి పడిపోయిన భారత్

by velandi.Saikiran |

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోజు రోజుకు భారత జట్టు దిగజారుతోంది. యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా

WTC: ఆరో స్థానానికి పడిపోయిన భారత్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోజు రోజుకు భారత జట్టు దిగజారుతోంది. యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా విజయం, వెస్టిండీస్ పై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తాజా WTC పాయింట్ల‌ పట్టికలో భారత జట్టు ఆరవ స్థానానికి పడిపోయింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఉంది. న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక నాలుగు అలాగే పాకిస్తాన్ ఐదో స్థానం ద‌క్కించుకుంది. పాకిస్తాన్ తర్వాత భారత జట్టు ఆరవ స్థానంలో ఉండడం గమనార్హం. ఇటు యాషెస్‌ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఏడో స్థానంలో నిలిచింది. WTC సిరీస్ లో భారత జట్టు మరో 9 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 8 మ్యాచ్ లు గెలిస్తేనే ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు చేరే అవకాశాలు ఉంటాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story