- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాంటీ డోపింగ్.. వినేశ్ ఫొగాట్‌కు WFI షోకాజ్ నోటీసులు.. దేశవాళీ పోటీలకు నిషేధం
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) భారీ షాక్ ఇచ్చింది. పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి మ్యాట్‌పైకి అడుగుపెట్టాలనుకున్న ఆమె ఆశలకు బ్రేక్ వేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) భారీ షాక్ ఇచ్చింది. పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి మ్యాట్‌పైకి అడుగుపెట్టాలనుకున్న ఆమె ఆశలకు బ్రేక్ వేసింది. మే 10 నుంచి 12 వరకు గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనకుండా ఆమెను నిషేధించింది. యాంటీ-డోపింగ్ నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణా రాహిత్యం కింద డబ్ల్యూఎఫ్‌ఐ ఆమెకు 15 పేజీల షోకాజ్ నోటీసును జారీ చేసింది. దీనితో పాటు 2026 జూన్ 26 వరకు దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకుండా ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.
నోటీసులోని అంశాలు ఇవే..
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) యాంటీ-డోపింగ్ నిబంధనల ప్రకారం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ పోటీల్లోకి దిగాలంటే అథ్లెట్లు కనీసం ఆరు నెలల ముందుగా సమాచారం ఇవ్వాలి. వినేశ్ ఈ నిబంధనను పాటించలేదని డబ్ల్యూఎఫ్‌ఐ పేర్కొంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరువు నిబంధనల కారణంగా అనర్హతకు గురై దేశ ప్రతిష్టను దెబ్బతీశారని నోటీసులో ఆరోపించింది. యాంటీ-డోపింగ్ టెస్ట్ నిబంధనల్లో భాగంగా తన ఆచూకీ (whereabouts) తెలపడంలో విఫలమయ్యారని పేర్కొంది. మార్చి 2024లో అప్పటి ఐఓఏ తాత్కాలిక కమిటీ నిర్వహించిన ఎంపిక ట్రయల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా రెండు వేర్వేరు బరువు విభాగాల్లో పాల్గొనడాన్ని తప్పుబట్టింది. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వినేశ్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ 14 రోజుల గడువు ఇచ్చింది.
కొనసాగుతున్న డబ్ల్యూఎఫ్‌ఐ vs వినేశ్ వివాదం
తన పునరాగమనాన్ని అడ్డుకునేందుకే డబ్ల్యూఎఫ్‌ఐ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తోందని వినేశ్ ఆరోపించగా, సమాఖ్య ఆ వాదనలను తీవ్రంగా తోసిపుచ్చింది. మరోవైపు, రాబోయే ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌కు సైతం ఆమె దూరమైంది. 2025, 2026లో పతకాలు సాధించిన వారే ట్రయల్స్‌కు అర్హులని డబ్ల్యూఎఫ్‌ఐ నిబంధనలు మార్చడంతో.. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎలాంటి పోటీల్లో పాల్గొనని వినేశ్ అర్హత కోల్పోయింది.






