- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం రేపింది. బీమ్ 10 లీగ్ 2023-24 సీజన్‌లో ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ టోర్నీ విండీస్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ సీజన్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేవన్ సీర్లెస్, టైటాన్స్ టీమ్ యజమాని చిత్రంజన్ రాథోడ్, జట్టు అధికారి ట్రెవాన్ గ్రిఫిత్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. వీరు వెస్టిండీస్ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్టు ఐసీసీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురి వేటు వేసింది. అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ విధించింది. ఐసీసీ మోపిన అభియోగాలపై వివరణ ఇచ్చేందుకు వీరికి 14 రోజుల గడువు ఇచ్చింది. జేవన్ సీర్లెస్ విండీస్ దేశవాళీ క్రికెట్‌లో చాలా టోర్నీలు ఆడాడు. ఐపీఎల్‌లో కూడా పాల్గొన్న అతను 2018 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.






