- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రూల్‌పై నిషేధాన్ని ఎత్తివేయండి.. ఐసీసీకి కీలక రిక్వెస్ట్ చేసిన షమీ
by Harish |
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ కీలక విజ్ఞప్తి చేశాడు.

X
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ కీలక విజ్ఞప్తి చేశాడు. బంతిపై ఉమ్ము రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడు. కరోనా కారణంగా 2022లో బంతికి ఉమ్ము రాయడంపై ఐసీసీ నిషేధం విధించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. రివర్స్ స్వింగ్ రాబట్టానికి పేసర్లు బంతికి ఒకవైపు లాలాజలం అప్లై చేస్తారు. అయితే, నిషేధం విధించిన తర్వాత ఆటగాళ్లు చెమటను ఉపయోగిస్తున్నారు. దుబాయ్‌లో ఓ మీడియా సంస్థతో షమీ మాట్లాడుతూ.. సెలైవా వాడకాన్ని తిరిగి అనుమతించాలని కోరాడు. ‘మేము బంతిని రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ, సెలైవా లేకుండా అలా చేయడం చాలా కష్టం. సెలైవాను అనుమతించాలని మేము నిరంతరం కోరుతూనే ఉన్నాం. రివర్స్ స్వింగ్ ద్వారా ఆట మరింత ఆసక్తికరంగా మారుతుంది.’ అని షమీ తెలిపాడు.
Next Story






