Virat Kohli : ఆ గాయానికి ఇంజక్షన్ తీసుకున్న కోహ్లీ.. రంజీలు ఆడటం డౌటే?

by Harish |

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.

Virat Kohli : ఆ గాయానికి ఇంజక్షన్ తీసుకున్న కోహ్లీ.. రంజీలు ఆడటం డౌటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. విరాట్ గాయపడటమే అందుకు కారణం. దేశవాళీ ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు రంజీ ట్రోఫీలో ఆడతారని వార్తలు వచ్చాయి. ఈ నెల 23 నుంచి రంజీ సెకండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) ప్రకటించిన 41 మందితో కూడిన ఢిల్లీ జట్టులో కోహ్లీ, పంత్‌లను చేర్చింది. అయితే, కోహ్లీ రంజీ మ్యాచ్‌లు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అతను మెడ నొప్పితో బాధపడుతున్నట్టు ఢిల్లీ జట్టు వర్గాలు వెల్లడించాయి. ‘విరాట్ మెడనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఇంజక్షన్ తీసుకున్నాడు. తొలి రెండు రంజీ మ్యాచ్‌లకు అతను దూరమయ్యే చాన్స్ ఉంది. సెలెక్టర్లు దీనిపై అప్‌డేట్ ఇస్తారు.’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కోహ్లీ దేశవాళీ ఆడేందుకు సంశయిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విరాట్ ఇప్పటివరకు డీడీసీఏను సంప్రదించలేదని తెలుస్తోంది. విరాట్ దేశవాళీ ఆడి దశాబ్దంపైనే అవుతుంది. 2012లో చివరిసారిగా రంజీ మ్యాచ్ ఆడాడు. మరోవైపు, సౌరాష్టతో మ్యాచ్‌కు పంత్ అందుబాటులో ఉంటాడని డీడీసీఏ సెక్రెటరీ అశోక్ శర్మ తెలిపారు. దీంతో 7 ఏళ్ల తర్వాత రిషబ్ ఢిల్లీ తరపున ఆడబోతున్నాడు. ఈ నెల 23న ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది.


Next Story