డ‌కౌట్స్ లో కోహ్లీ రికార్డు...గంభీర్ ను పొగుడుతున్న ఫ్యాన్స్‌

by velandi.Saikiran |

Kohli 39 సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా రికార్డులోకి ఎక్కాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 34 సార్లు డకౌట్ అయితే, సచిన్

డ‌కౌట్స్ లో కోహ్లీ రికార్డు...గంభీర్ ను పొగుడుతున్న ఫ్యాన్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. దాదాపు 200 రోజుల తర్వాత టీమిండియా జెర్సీ ధరించిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడతాడని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో దారుణ ప్రదర్శన కనబరిచాడు కోహ్లీ. 8 బంతులు ఆడి, ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయలేదు. డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే డకౌట్స్ లో కూడా సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ లో 39 సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా రికార్డులోకి ఎక్కాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 34 సార్లు డకౌట్ అయితే, సచిన్ టెండూల్కర్ కూడా 34 సార్లు ఖాతా ఓపెన్ చేయకుండా ఔట్‌ అయ్యాడు. అయితే ఈ రికార్డు వైరల్ కావడంతో గౌతమ్ గంభీర్ ను మెచ్చుకుంటున్నారు జనాలు. విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మలను టీమిండియా నుంచి తొలగించాలని, వారిద్దరి పట్ల గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు కూడా కరెక్టే అంటున్నారు. వీళ్ళిద్దరూ ఇలాగే ఆడితే కచ్చితంగా టీమిండియా నుంచి వెళ్ళిపోవాల్సిందేనని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు వన్డేల్లో రోకో రాణించకపోతే కచ్చితంగా గౌతమ్ గంభీర్ తొలగించడం ఖాయమని అంటున్నారు.






Next Story