Asia Cup 2022: సెంచరీతో కింగ్ ఈజ్ బ్యాక్.. అప్ఘానిస్తాన్‌కు బిగ్ టార్గెట్

by Vinod kumar |   (  Updated:2022-09-08 18:12:47  IST  )

ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్-4లో అఫ్ఘానిస్తాన్‌తో - Virat Kohli century team india huge score vs afg asia cup-2022 super-4

Asia Cup 2022: సెంచరీతో కింగ్ ఈజ్ బ్యాక్.. అప్ఘానిస్తాన్‌కు బిగ్ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్-4లో అఫ్ఘానిస్తాన్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ చెలరేగింది. విరాట్ కోహ్లీ సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కోహ్లీ (61 బంతుల్లో 122, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత్ 212 పరుగులు చేసింది. అప్ఘాన్ ముందు 213 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కేఎల్ రాహుల్ (62) అర్ధ సెంచరీతో రాణించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ.. కేఎల్ రాహుల్‌తో కలిసి జట్టును ముందుకు నడిపాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు.

Next Story